సాప్ట్‌వేర్‌ బ్లూస్‌ అంటే లక్షల్లో శాలరీలు, అమ్మాయిలు, పబ్బులు కాదు | Software Blues Trailer Launched By Director Krish | Sakshi
Sakshi News home page

Software Blues: సాప్ట్‌వేర్‌ బ్లూస్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Published Mon, Jun 13 2022 9:02 AM | Last Updated on Mon, Jun 13 2022 9:02 AM

Software Blues Trailer Launched By Director Krish - Sakshi

శ్రీరాం, భావన, ఆర్యమాన్, మహబూబ్‌ బాషా, కేయస్‌ రాజు, బస్వరాజ్‌ ముఖ్య తారలుగా ఉమా శంకర్‌ దర్శకత్వంలో సిల్వర్‌ పిక్సెల్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ బ్లూస్‌’. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా రిలీజ్‌ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు. ‘‘సాప్ట్‌వేర్‌ బ్లూస్‌ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు లక్షలలో శాలరీలు, అమ్మాయిలు... పబ్బులు కాదు ..’ అనే డైలాగ్‌తో ఉన్న ఈ ట్రైలర్‌ చాలా హిలేరియస్‌గా ఉంది.

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు, వారి జీవితాల గురించి ఉమాశంకర్‌ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు క్రిష్‌. ‘‘సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌లో అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే విధంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సిల్వర్‌ పిక్సెల్‌ మీడియా వర్క్స్‌ వీకే రాజు.

చదవండి: తన సినిమాకు తనే పాట రాసిన డైరెక్టర్‌.. అదిరిపోయిందిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement