Director Krish Releases the Shriya Saran's 'Gamanam' Movie First Look on Her Birthday | ‘గమనం’ ఫస్ట్ ‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసిన క్రిష్‌ - Sakshi
Sakshi News home page

‘గమనం’ ఫస్ట్ ‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసిన క్రిష్‌

Published Fri, Sep 11 2020 2:48 PM | Last Updated on Fri, Sep 11 2020 3:46 PM

On Birthday Of Shriya Saran Krish Release Gamanam First Look - Sakshi

శ్రియా సరన్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయ్యాయి. కానీ చెక్కుచెదరని అందంతో కొత్త హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకోగల శ్రియ దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చిన శ్రియ మళ్ళీ కెమరా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌. దర్శకుడు క్రిష్ గమనం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో శ్రియ చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం వేసుకొని ఓ సాధారణ భారతీయ గృహిణిలాగా కనిపిస్తున్నారు. దీన్ని చూస్తుంటే శ్రియ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. (చదవండి: 'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు')

సుజ‌నా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు, జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. శ్రియతో పాటుగా ఈ చిత్రంలో శివ కందుకూరి, నిత్యా మీనన్‌, ప్రియాంక జవాల్కర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రియ రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో భారీ బడ్జెట్‌తో, పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement