
నిత్యా మీనన్
శ్రియ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గమనం’. లేడీ డైరెక్టర్ సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందింది. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వీఎస్ నిర్మించారు. ఈ చిత్రంలో గాయని శైలపుత్రీ దేవి అనే పాత్ర పోషిస్తోన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ ఆవిష్కరించారు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రియల్ లైఫ్ డ్రామాగా ‘గమనం’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఇళయరాజా, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్.
Comments
Please login to add a commentAdd a comment