Hero Kiran Abbavaram Rules Ranjan First Look Poster Released - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram Movie First Look: 'రూల్స్ రంజన్‌' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌..

Published Fri, Jul 15 2022 6:07 PM | Last Updated on Fri, Jul 15 2022 6:51 PM

Kiran Abbavaram Rules Ranjan First Look Poster Released - Sakshi

Rules Ranjan First Look Poster Released: 'యస్ఆర్‌ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. ఇటీవలే "సమ్మతమే" చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్‌తో అలరించిన కిరణ్‌ అబ్బవరం తాజాగా 'రూల్స్‌ రంజన్‌' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి కిరణ్ అబ్బవరం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా శుక్రవారం (జులై 15) రిలీజ్‌ చేశారు. బిజినెస్‌ మ్యాన్‌ సూట్‌లో చాలా డిఫరెంట్‌గా కనువిందు చేశాడు కిరణ్‌ అబ్బవరం.

 ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ‘డి.జె.టిల్లు’ సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్), అతుల్ పర్చురే (బాలీవుడ్), ఆశిష్ విద్యార్థి, అజయ్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన నటీనటులతో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని  దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా కిరణ్‌ అబ్బవరం బర్త్‌డే సందర్భంగా శుక్రవారం 'మీటర్‌' మూవీ ఫస్ట్  లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

చదవండి: అన్నదమ్ములతో డేటింగ్‌ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్‌
మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్‌.. యాంకర్‌పై ఆగ్రహం
దిల్‌ రాజు కొడుకు పేరేంటో తెలుసా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement