
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడికల్ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు. అంతేకాకుండా ఆ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటిందంటే.. పవన్-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారట. (పవన్ ‘వకీల్ సాబ్’: మరో లీక్)
అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదంట కేవలం అతిథి పాత్రలో చెర్రీ మెరవనున్నాడట. అంతేకాకుండా కనిపించేది కొద్దిసేపే అయినా చాలా పవర్ ఫుల్‌గా ఉండనుందట చరణ్ పాత్ర. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ వార్త నిజమైతే మెగా అభిమానులకు శుభవార్తే. ఇప్పటికే రామ్‌చరణ్ తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘ఆచార్య’ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. (జానీ మాస్టర్‌కు స్పెషల్ బర్త్ డే విషెస్)
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో పవన్ నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మేజర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే లాక్‌డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ నిరవధిక వాయిదాపడింది. ఇక క్రిష్ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేసినట్లు సమాచారం. అయితే పవన్ లేకుండానే తొలి షెడ్యూల్ షూటింగ్‌కు క్రిష్ ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మొగలాయిల కాలం నాటి ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందబోతుందని, ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహాలో పవర్‌ఫుల్ దొంగలా దర్శనమివ్వబోతున్నారని లీకువీరులు పేర్కొన్న విషయం తెలిసిందే. (చెర్రీ ఆసక్తికర ట్వీట్.. వైరల్)
Comments
Please login to add a commentAdd a comment