
న్యాయవాది పాత్రలో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన సినిమా ‘వకీల్‌సాబ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ సిద్ధమవుతున్నాడు. సినిమాలోని కీలక పోరాట సన్నివేశాల కోసం పవన్ కల్యాణ్ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. శూలం, దండెంలతో పవన్ కసరత్తు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
నల్లటి దుస్తులు వేసుకుని తెల్లవారుజామున 7 గంటలకు పవన్ కల్యాణ్ సాధన చేస్తున్నారు. చారిత్రక వీరుడు పాత్రలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా శ్రీలంక తార జాక్వలైన్ ఫెర్నాండైజ్ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. పవన్ వజ్రాల దొంగగా తెరపై ఆలరించనున్నట్లు సమాచారం. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

