Pawan Kalyan Hari Hara Veera Mallu Restart With Action Sequence: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా వేవ్స్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.
'హరిహర వీరమల్లు' చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో పుఃనప్రారంభించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పవన్ కల్యాణ్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనున్నట్లు సమాచారం.
Hari Hara Veera Mallu Movie: హరిహర వీరమల్లు పునఃప్రారంభం !.. స్క్రిప్ట్ పనులపై చర్చ
Published Sun, Feb 6 2022 12:52 PM | Last Updated on Sun, Feb 6 2022 1:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment