‘ఎన్టీఆర్‌’ మహానాయకుడు వాయిదా పడింది! | NTR Biopic Second Part May Be postponed | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 12 2018 10:51 AM | Last Updated on Mon, Nov 12 2018 2:22 PM

NTR Biopic Second Part May Be postponed  - Sakshi

నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాథను వెండితెరపై రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని ‘కథానాయకుడు’గానూ, రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’గానూ విడుదల చేయనున్నారు. అయితే గతంలో ఈ రెండు పార్ట్‌లకు సంబంధించిన రిలీజ్‌ డేట్స్‌ (జనవరి 9, 24)ను ప్రకటించింది చిత్రబృందం. 

అయితే తాజాగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు చేసిన విజ్ఞప్తిని చిత్రయూనిట్‌ పరిగణలోకి తీసుకుందని సమాచారం. ఈ రెండు పార్ట్‌లకు రెండు వారాలే గ్యాప్‌ ఉంటే నష్టపోయే అవకాశం ఉందని బయ్యర్లు ఆందోళన చేశారని, వారి విజ్ఞప్తి మేరకు రెండో పార్ట్‌ ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇంతకు ముందే ‘మహానాయకుడు’ విడుదల వాయిదా కానుందని ప్రచారం సాగినా.. వాటిపై మేకర్స్‌ రియాక్ట్‌ కాలేదు. మరి ఇప్పుడైనా చిత్రయూనిట్‌  వీటిపైన స్పందించి అధికారికంగా ప్రకటిస్తుందో లేదో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement