ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ లాంగ్ గ్యాప్ తరువాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. షూటింగ్ సమయంలో ఓ అభిమానితో బాలయ్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో చిత్రయూనిట్ అధికారికంగా లుక్‌ను రిలీజ్ చేశారు.
డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఉన్న బాలయ్య ఈ సినిమాలో అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లు నిరాశపరచటంతో బాలయ్య అభిమానులు ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కమర్షియల్ దర్శకుడిగా పేరున్న కేయస్ రవికుమార్ డైరెక్షన్‌లో బాలకృష్ణ సక్సెస్‌ట్రాక్‌లోకి వస్తాడని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment