
తొలి సినిమా ఆర్‌ఎక్స్ 100తోనే సెన్సేషన్ సృష్టించిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పాయల్‌కు తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సీనియర్ హీరో రవితేజకు జోడిగా డిస్కోరాజా సినిమాలో, వెంకటేష్‌కు జోడిగా వెంకీ మామ సినిమాలో నటిస్తున్నారు పాయల్ రాజ్‌పుత్. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సీత సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అలరించనున్నారు.
తాజాగా ఈ అమ్మడు మరో సీనియర్ హీరోతో జోడి కట్టేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment