
నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ సినిమాలు బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చాయి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ బయోపిక్ బాలయ్యకు భారీ నష్టాలతో పాటు అదే స్థాయిలో చెడ్డపేరు కూడా తెచ్చిపెట్టింది. దీంతో తదుపరి చిత్రాల విషయంలో ఆలోచనలో పడ్డాడు బాలకృష్ణ.
ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి.. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్‌తో మాస్ యాక్షన్ సినిమాకు రెడీ అయ్యాడు. అయితే తాజా సమాచారం ప్రకారం కేయస్ రవికుమార్ సినిమాను కూడా బాలయ్య చేయటం లేదట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రవికుమార్ చెప్పిన కథతో సినిమా చేస్తే సమస్యలు వస్తాయన్న ఆలోచనతో సినిమాను ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment