
ఒక సినిమా హిట్ కావాలంటే స్టార్స్ ఉంటే సరిపోతుందని అనుకునే కాలం పోయింది. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. సినిమాలో కంటెంట్ ఉండాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎటువంటి అంచనాలు, స్టార్ కాస్టింగ్ లేకుండా వచ్చిన చిన్న సినిమాలెన్నో పెద్ద విజయాలు సాధిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో రాబోతోన్న మరో సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. రానా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్న ఈ సినిమాపై అంచనాలు పెరుతున్నాయి. ఈ మూవీ ప్రివ్యూ చూసిన సుకుమార్, క్రిష్‌లు సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రతీ పాత్ర వెంటాడుతుందని, సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాలకే కంచరపాలెం గ్రామంలోకి వెళ్లేలా చేస్తుందని, నవ్వుతాం, ఏడుస్తాం, బాధపడతాం ప్రతీ క్యారెక్టర్‌తో కనెక్ట్ అవుతామంటూ చెప్పుకొచ్చారు. పరుచూరి ప్రవీణ నిర్మించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment