
గేయరచయిత వేణు గుడిపెల్లి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యువరైతు’. ఆర్‌పీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాగుల ప్రసాదరావు నిర్మించాడు. ప్రభాకర్ దమ్ముగారి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు.
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ... రైతుకి కన్నతల్లి.. నేల తల్లి ఇద్దరూ ఒక్కటే అని... కష్టమైనా నష్టమైనా విడువడు ఎన్నటికి అని.. వ్యవసాయాన్ని, సాయాన్ని సరికొత్తగా అభివర్ణించారని మెచ్చుకున్నారు. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ దమ్ముగారిని, సాహిత్యాన్ని అందించిన దర్శకుడు వేణు గుడిపెల్లి గారిని ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయ పట్టభద్రుడి అందమైన హృద్యమైన ప్రేమ కథ ఇదని దర్శకుడు వేణు గుడిపెల్లి వివరించారు. భూమిని నమ్ముకున్న నాన్న చనిపోయాక.. అదే భూమిని నమ్మిన కొడుకు ఏం చేశాడు? అనేదే సినిమా కథ అని చెప్పారు.
ప్రస్తుత సమాజంలో రైతు విలువని గుర్తు చేసే చిత్రమిదన్నారు. నిర్మాత రాగుల ప్రసాద్ రావు మాట్లాడుతూ... ఈ సినిమా ప్రతీ రైతుదే కాదు, అన్నం విలువ తెలిసిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నారు. సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ... "ఇందులో ఉన్న భావోద్వేగాలు అద్భుతమని, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళే సినిమా" అని తెలిపారు.
చదవండి: ప్రశాంత్‌ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా?
Comments
Please login to add a commentAdd a comment