రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో వివేకానంద్, కేదార్, నిర్భయ్‌లను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీసీపీ డాక్టర్ వినీత్ స్పందించారు. అసలేం జరిగింది? ఏం జరుగుతుందనేది వివరించారు.
(ఇదీ చదవండి: పరారీలో క్రిష్.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!)
'రాడిసన్ హోటల్‌లో కొకైన్ సేవించిన కేసులో డ్రగ్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్‌ని అరెస్ట్ చేశాం. ఇతడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఇప్పటివరకు 10 సార్లు గజ్జెల వివేకానంద్‌కు డెలివరీ చేసినట్లు చెప్పాడు. ఇదే హోటల్‌లో గతంలో కూడా పార్టీ చేసుకున్నట్లు మాకు తెలిసింది. శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారు. చరణ్.. బెంగళూరులో ఉన్నానని, వస్తున్నానని చెప్పాడు. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారు. ఇతడు డ్రగ్ టెస్ట్‌కి వస్తున్నానని చెప్పాడు'
'హోటల్ నిర్వాహకులపై కూడా కేసులు పెడతాం. అబ్బాస్ పదిసార్లు డ్రగ్స్ తెచ్చాడు, ఇన్నిసార్లు ఎక్కడి నుండి తెస్తున్నాడో విచారిస్తున్నాం. సరఫరా చేసిన ప్రతిసారి 4 గ్రాముల కొకైన్ తెచ్చాడని తెలిసింది. అలానే డైరెక్టర్ క్రిష్‌ని విచారిస్తాం. డ్రగ్ పరీక్షలు కూడా చేస్తాం. రక్త, మూత్ర పరీక్షలు చేస్తే అసలు నిజమేంటనేది తెలుస్తుంది. దీంతో పాటు వివేకానంద్ డ్రగ్ పార్టీలు ఎందుకు చేస్తున్నాడో విచారిస్తాం' అని డీసీపీ వినీత్ చెప్పారు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే)
Comments
Please login to add a commentAdd a comment