Vaishnav Tej Kondapolam Movie Motion Poster First Look Released - Sakshi
Sakshi News home page

వైష్ణవ్‌ తేజ్‌-క్రిష్‌ మూవీ టైటిల్‌ ఇదే, ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Fri, Aug 20 2021 11:18 AM | Last Updated on Fri, Aug 20 2021 5:06 PM

Vaishnav Tej And Krish Movie Title And Motion Poster First Look Release - Sakshi

‘ఉప్పెన’ మూవీతో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న వైష్ణవ్‌ రెండవ చిత్రం ప్రముఖ దర్శకుడు జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొండపాలెం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్‌ను ‘కొండపొలం’గా ఖారారు చేసి ఈ మేరకు శుక్రవారం ఉదయం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. గడ్డం, మాస్‌లుక్‌లో పంజా వైష్ణవ్‌ ఎంట్రీ ఇచ్చాడు. 

చదవండి: Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి 

కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వైష్ణవ్ ‌తేజ్‌కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: మళ్లీ వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement