Vaishnav Tej Kondapolam Trailer Out: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, లిరికల్ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘కొండపొలం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.
Embark on the Astounding Journey of #KondaPolam - "An Epic Tale of Becoming"
— Krish Jagarlamudi (@DirKrish) September 27, 2021
▶️ https://t.co/qlLNaZIJ9C#KondaPolamTrailer Out Now!#KondaPolamOct8#PanjaVaisshnavTej @Rakulpreet @mmkeeravaani @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel
ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ విషయానికొస్తే.. వైష్ణవ్, రకుల్‌ల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ కనిపించాడు. అడవి నేపథ్యం నుంచి బాగా చదువుకున్న యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అతడు ఎదుర్కొ అవమానాలను ట్రైలర్‌లో చూపించారు. ఇక రకుల్, వైష్ణవ్ మధ్య సాగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ‘చదువుకున్న గొర్రె చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా?’ అంటూ రకుల్.. వైష్ణవ్ ఆటపట్టిస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక గొర్రెల కోసం వైష్ణవ్ చేసే సాహస సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్
వర్షంలో సైక్లింగ్ చేసిన సమంత.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment