
Shwaasalo Lyrical Video From Kondapolam: కొండపొలం నుంచి 'శ్వాసలో హద్దులని దాటాలనే ఆశ' అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
Shwaasalo Lyrical Video From Kondapolam: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఓ..ఓ ఓబులమ్మా సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటని విడుదల చేశారు.
‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కీరవాణి సంగీతం అందించినీ పాటను యామిని ఘంటసాల, పీవీఎస్‌ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ పాటలో వైష్ణవ్, రకుల్ మధ్య కెమిస్ట్రీని ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.