Obulamma Video Song : Kondapolam Movie First Song Out Now - Sakshi
Sakshi News home page

Kondapollam Movie First Song: ‘కొండపొలం’ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

Published Fri, Aug 27 2021 7:04 PM | Last Updated on Sat, Aug 28 2021 4:24 PM

Kondapolam Movie First Song Released - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌-వైష్ణవ్‌తేజ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘కొండపొలం’. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లకు విశేషణ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్‌సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘ఓ..ఓ ఓబులమ్మా.. బుట్ట చెండు ఆటలో నా పూల కొమ్మా’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా వైష్ణవ్‌ తేజ్‌.. రకుల్‌ను ఊహించుకుంటూ ఈ పాట పాడుతుంటే.. లంగావోణిలో రోలు తప్పితూ ఈ పాటలో గొంతు కలిపింది రకుల్‌. ఈ సాంగ్‌లో వైష్ణవ్‌-రకుల్‌ మధ్య కెమిస్ట్రీ బాగా పడింది.

చదవండి: హీరోయిన్‌ రకుల్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా?

వీరి లవ్‌ ట్రాగ్‌ పాటకు అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను గాయకులు సత్య యామిణి, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌లు ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, చంద్రబోస్‌లు పాటకు సాహిత్యం అందించారు. కొండపొలం నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్‌ లంబోర్ఘిని, చరణ్‌ ఫెరారీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement