Pawan Kalyan Periodic Movie Warrior Look Leaked From Director Krish- Sakshi
Sakshi News home page

PSPK27 షూటింగ్‌ సెట్‌లో పవన్‌.. ఫొటోలు లీక్‌

Published Fri, Feb 26 2021 4:05 PM | Last Updated on Fri, Feb 26 2021 5:26 PM

Pawan Kalyan New Period Movie Look Leaked From Krish Film - Sakshi

డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫిబ్రవరి 22న తిరిగి సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా పీఎస్‌పీకే 27 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ మూవీ క్రిష్‌ 17వ శతాబ్దపు కాలం నాటి పిరియాడికల్‌ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిస్తు‍న్నారు. దీని కోసం అప్పటి కాల పరిస్థితులకు సరిపోయేలా హైదరాబాద్‌లో సెట్స్‌‌ వేసి పవన్‌పై భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి ఆయన అభిమానులంతా  #pspk27 అనే హ్యాష్‌ ట్యాగ్‌ను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ అందింది.  ఈ మూవీ షూటింగ్‌ సట్స్‌లోని పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో పవన్‌ వారియర్‌ దుస్తుల్లో కొత్తగా దర్శనమిచ్చాడు.

ఇక పవన్‌ను పోరాట యోధుడి దుస్తుల్లో చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు. కాగా ఎమ్‌ఎమ్‌ రత్నం నిర్మిస్తున్న ఈసినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్‌ ముందు గతేడాది మార్చిలో 15 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్‌ను నిర్వహించారు. సెప్టెంబర్‌ 2న పవన్‌ బర్త్‌డే సందర్భంగా మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌లు కథానాయికలు కాగా.. బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. అంతేగాక పవన్‌ ఈ సినిమాతో పాటు సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement