
మాటల రచయిత పరుశురాం శ్రీనావాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్, శివజామి, నాగేంద్ర, విజయ్ రాగం తదీతరులు నటిస్తున్నారు. యాక్షన్ సినిమా రూపొందిన ఈ మూవీ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్‌ను చూశాను. అద్భుతంగా ఉంది. పరశురాం శ్రీనివాస్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం చాలా బాగుతుంది. చిన్న సినిమాలో ఈ ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక డైలాగ్స్ అయితే కేజీయఫ్ సినిమాను గుర్తు చేస్తున్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. అలాగే నిర్మాత సురెడ్డి విష్ణు మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఖచ్చితంగా రణస్థలి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదిరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే మూవీ ట్రైలర్, టీజర్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment