![PSPK 27 Movie First Look, Title Release On March 11 - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/8/pawan_0.jpg.webp?itok=T9IpCVHI)
పవన్‌కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
ఇక పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ 27వ సినిమా చేస్తున్నాడు. దీనికి హరిహర వీరమల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment