
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. భారీ ఎత్తున 17వ శతాబ్దపు చార్మినార్ సెట్‌ను రూపొందించే పనిలో దర్శకుడు క్రిష్ అండ్ టీమ్ బిజీగా ఉన్నారు. కథలో భాగంగా ఆనాటి చార్మినార్ పరిస్థితులను, దాని పరిసర ప్రాంతాలపై సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. దీంతో చార్మినార్ సెట్ రూపకల్పన చేస్తోంది టీమ్.
ఈ సెట్లో వచ్చే నెలలో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఈ సెట్ నిర్మాణం సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా కానుందని తెలుస్తోంది. దీనిని సైరా నర్సింహరెడ్డి ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఈ సెట్‌కు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు హరహర మహాదేవ, హరిహర వీరమల్లు, విరూపాక్ష అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment