
నందమూరి తారకరామారావు పేరు తెలియని తెలుగు వారుండరు. సినీ, రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు వారికి రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే. ఎన్టీఆర్ చేయని ప్రాత లేదు. వెండితెరపై ఎన్టీఆర్ జీవిత చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించబోతోన్నారు. బాలకృష్ణ ఈ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్’ పేరుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నోరూమర్స్ తర్వాత ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
క్రిష్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక కథలో, కథనంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయట. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉండబోతోన్నాయి. అందుకోసం కొత్తవారిని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. ఆసక్తి కలిగిన వారందరకీ ఆహ్వానం పలుకుతూ ఓ ప్రకటను విడుదల చేసింది చిత్రయూనిట్. వయసుతో నిమిత్తం లేకుండా...వారు నటిస్తూ తీసిన ఓ 30 సెకన్ల వీడియోను ప్రకటనలో ఇచ్చిన మెయిల్ అడ్రస్‌కు పంపాలని కోరారు.
A casting call to be part of #NTRBioPic. A film by @DirKrish featuring Natasimha #NandamuriBalakrishna in the title role
— BARaju (@baraju_SuperHit) June 5, 2018
| @NBKFilms_ @vishinduri @VaaraahiCC | @mmkeeravaani #NBK103 | #NBKsNTRBiopic | pic.twitter.com/6bgdE0d25L
Comments
Please login to add a commentAdd a comment