ఈ సీన్‌ ‘మణికర్ణిక’లో ఉంటే.. అదిరిపోయేది! | Sonu Sood Fighting Scene In Manikarnika Leaked | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 29 2019 8:24 PM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Sonu Sood Fighting Scene In Manikarnika Leaked - Sakshi

మణికర్ణిక విడుదలై ఒకవైపు పాజిటివ్‌ టాక్‌ను సంపాదించి.. కలెక్షన్లలో పుంజుకుంటుంటే.. మరోవైపు వివాదాలు కూడా వస్తున్నాయి. సినిమాలో మణికర్ణిక పాత్రలో నటించిన కంగనాకు ప్రశంసలు వస్తున్నాయి కానీ డైరెక్షన్‌ క్రెడిట్‌ పూర్తిగా తన అకౌంట్లో వేసుకోవడం మాత్రం దర్శకుడు క్రిష్‌కు మింగుడు పడటం లేదు. ఈ వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

మణికర్ణిక విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో క్రిష్‌ మాట్లాడుతూ.. తాను తీసిన సినిమా బంగారంలా ఉంటే ప్రస్తుతం చూస్తున్న సినిమా వెండిలా ఉందని.. కంగనా, సోనూసూద్‌ నటించిన పాత్రను తగ్గించాలని పట్టుబట్టిందన్నారు. కానీ తాను వినిపించుకోలేదని, కథలో తనకు ఇష్టవచ్చిన మార్పులు చేసిందని కంగనాపై ఆరోపణలు చేశారు. తాను ఈ సినిమా కోసం ఎంతో పరిశోధించానని, చరిత్రను వక్రీకరించడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే క్రిష్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నాక.. తన పాత్రను తగ్గిస్తామని చెప్పేసరికి సోనూసూద్‌ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. 

అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. సోనూసూద్‌పై షూట్‌ చేసిన ఓ సన్నివేశం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సినిమా ఎండింగ్‌ వరకు ఆయన పాత్ర ఉంటుందని, సోనూసూద్‌పై తీసిన సన్నివేశాలు ఎంతో బాగుంటాయని క్రిష్‌ చెప్పడం.. ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్‌ లీక్‌ అవ్వడం చూస్తే.. కంగనా కావాలనే సోనూసూద్‌ పాత్రను తగ్గించినట్లుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సోనూసూద్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాక.. మహ్మద్ జీషన్ తో రీ షూట్ చేసింది. ఆ పాత్రను పూర్తిగా మార్చేయడంతో పెద్దగా ప్రాముఖ్యత లేకుండాపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement