సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో సోమవారం రాత్రి పార్టీని నిర్వహించగా, అగ్ర దర్శకులంతా హాజరయ్యారు. రాజమౌళి, సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీశ్ శంకర్‌లతోపాటు అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ వంగవీటి, వంశీ పైడిపల్లి ఇలా అంతా ఒక్కచోట చేరారు. వీరంతా కలిసి ఓ ఫోటో దిగగా, ‘అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను’ అంటూ వంశీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం చెర్రీ-తారక్‌ల మల్టీస్టారర్ కోసం కథ సిద్ధం చేస్తుండగా, సుకుమార్ మహేష్ కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్, వంశీ పైడిపల్లి మహేష్ బాబు 25వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్ ఎఫ్ 2 రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధం అయ్యాడు. కొరటాల, సందీప్, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్‌లు తమ తర్వాతి ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకుంటున్నారు.
A memorable evening with these Amazing people at home... Thank You @ssrajamouli Sir, @aryasukku, @sivakoratala , @harish2you, @DirKrish, @AnilRavipudi , #SandeepReddyVanga, #NagAshwin for making this evening happen.. :) pic.twitter.com/9qxHoCA2xo
— Vamshi Paidipally (@directorvamshi) 4 June 2018
'FUN'tastic..😀😀....it's great evening...thanks for hosting this amazing meet ..Vamshi Anna.... https://t.co/h6OBG80qhY
— Anil Ravipudi (@AnilRavipudi) 4 June 2018
Comments
Please login to add a commentAdd a comment