‘మణికర్ణిక’ పరిష్కారం క్రిష్‌ చేతిలోనే... | Manikarnika Clash with Akshay Kumar Gold | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 17 2018 9:58 AM | Last Updated on Sat, Feb 17 2018 12:27 PM

Manikarnika Clash with Akshay Kumar Gold - Sakshi

మణికర్ణిక షూటింగ్‌లో నటి కంగనకు సీన్‌ను వివరిస్తున్న దర్శకుడు క్రిష్‌

సాక్షి, సినిమా : టాలీవుడ్‌ టాలెండెట్‌ దర్శకుడు క్రిష్‌​ జాగర్లముడి ప్రస్తుతం బాలీవుడ్‌ ప్రాజెక్టు మణికర్ణికతో బిజీగా ఉన్నాడు. బాహుబలి రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించగా.. రాణి లక్ష్మీబాయి జీవితగాథగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. అయితే ఈ చిత్రానికి ఒప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది.

ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. షూటింగ్‌లో జాప్యం జరుగుతుండటంతో సమయానికి విడుదల కావటం అనుమానంగా మారింది. దీనికి తోడు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా ఎక్కువగా ఉండటం.. ఈ పరిణామాల నేపథ్యంలో రిలీజ్‌ను పోస్ట్‌ పోన్‌ చేశారు. ఏప్రిల్‌ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో అక్షయ్‌ కుమార్‌ నటించిన గోల్డ్‌ చిత్రం విడుదల కాబోతోంది.

ఒలంపిక్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో గోల్డ్‌ పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో మణికర్ణిక-గోల్డ్‌ మధ్య గట్టి పోటీ తప్పదనే అనిపిస్తోంది. అయితే ఈ మధ్యే పద్మావత్‌ కోసం తన చిత్రాన్ని(ప్యాడ్‌ మ్యాన్‌) రిలీజ్‌ను వాయిదా వేసుకున్న అక్కీ.. మరోసారి ఆ పని చేయటమే అనుమానంగానే కనిపిస్తున్నప్పటికీ.. తనతో గబ్బర్‌ చిత్రానికి పని చేసిన క్రిష్‌.. మణికర్ణికకు దర్శకుడు కావటం.. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఆ దిశగా చర్చలు జరిపితే వర్కవుట్‌ అవొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement