Gold Movie
-
బాలీవుడ్ సినిమాలపై ‘గోవిందుడి’ దెబ్బ
విజయ్ దేవరకొండ వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం విజయ్ స్టార్‌డమ్‌ను పెంచేసింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్.. గోవిందుడిగానూ ప్రేక్షకులను మెప్పించేశాడు. వసూళ్లలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘గీత గోవిందం’కు ఎదురులేకుండా పోయింది. కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడే కాక ఓవర్సీస్లో కూడా దూసుకెళ్తోంది. అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక ఆస్ట్రేలియాలో పరిస్థితిని చూస్తే మాత్రం బాలీవుడ్‌కు నిద్ర పట్టేలా కనిపించడం లేదనిపిస్తోంది. అక్కడ గత వారం విడుదలైన గోల్డ్, సత్యమేవ జయతే సినిమాలు ‘గీత గోవిందం’ ధాటికి నిలబడలేకపోతున్నాయట. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’, జాన్ అబ్రహం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’ సినిమాలు ఆస్ట్రేలియాలో ‘గీత గోవిందం’ జోరు చూసి ఖంగుతిన్నాయట. ఈ రెండు కలిసి 1.92లక్షల డాలర్లు వసూళ్లు చేయగా.. గీత గోవిందం మాత్రం 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు చేసిందని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు విజయ్ దేవరకొండ హవా ఏ రేంజ్లో ఉందో. పరుశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్గా నటించింది. Guess which Indian film has proven a tough opponent to #Gold and #SatyamevaJayate in Australia? Telugu film #GeethaGovindam, starring Vijay Deverakonda... The *combined* weekend biz of the two Hindi films [A$ 192,306] is less than that of #GeethaGovindam [A$ 202,266]. @comScore — taran adarsh (@taran_adarsh) August 20, 2018 -
ఐకమత్యం లేకపోతే ఎన్నటికీ గెలవలేం..!
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గోల్డ్’. 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్ మెడల్ అందించిన కోచ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గోల్డ్ టీజర్, ట్రైలర్లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఐమాక్స్ వర్షన్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఐమాక్స్ వర్షన్ టీజర్‌ను ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. బుధవారం రిలీజ్ అయిన ఐమాక్స్ ప్రత్యేక వర్షన్ టీజర్‌కు కూడా మంచి రెస్సాన్స్ వస్తోంది. ‘జట్టులో ఐకమత్యం లేకపోతే ఎన్నటికీ కప్ గెలవలేం’ ‘చేపకు ఇదటం నేర్పించొద్దు’ లాంటి డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సద్, వినీత్ కుమార్‌సింగ్‌లు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న గోల్డ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘గోల్డ్’ ట్రైలర్ రిలీజ్
-
అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ ట్రైలర్ విడుదల
-
అంచనాలను పెంచేసిన గోల్డ్ ట్రైలర్
1948 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే ‘గోల్డ్’. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. 2:18నిమిషాల పాటు కొనసాగిన ‘గోల్డ్’ ట్రైలర్, పేరుకు తగినట్లుగానే బంగారం లాంటి సినిమా అనిపిస్తుంది. ‘గోల్డ్, బ్రిటిష్ ఇండియా’ అనే వాయిస్ ఓవర్‌తో 1936 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ట్రైలర్లో బ్రిటీష్ జెండా వైవు తదేకంగా చూస్తున్న అక్షయ్ కుమార్ కళ్లల్లో ‘ఇది కాదు నేను కోరుకున్నది’ అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైలర్లోనే ఈ ఖిలాడీ హీరో దేశభక్తితో పాటు క్రీడల పట్ల తన ప్రేమను ఏక కాలంలోఅద్భుతంగా ప్రదర్శించాడు. బుల్లితెర ధారవాహిక ‘నాగిని’ ఫేం మౌనీ రాయ్ అక్షయ్‌ను బెంగాలీలో తిడుతూ ఓ 5 సెకన్ల పాటు కనిపించింది. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడిగా మౌనీరాయ్ నటించిన సంగతి తెలిసిందే. కాగా మౌనీరాయ్కు ఇదే తొలి బాలీవుడ్ చిత్రం. ఒకదాని తరువాత ఒకటిగా ఇతర పాత్రల్లో నటించిన కునాల్ కపూర్, అమిత్ సాద్, వినీత్ కుమార్ సింగ్, సన్నీ కౌశ్ల్ల పాత్రల పరిచయం ఉంటుందిం. వీరందరిని దేశం తరుపున హాకీ ఆడే ఆటగాళ్లుగా పరిచయం చేస్తూ ట్రైలర్ కొనసాగింది. ఈ చిత్రంలో అక్షయ్ స్వతంత్ర భారతావని తరుపున ఒలంపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించే హాకీ జట్టు కోచ్ ‘తపం దాస్’ పాత్రలో కనిపించనున్నారు. చిత్రం తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఒక్కడి కల.. ఇండియాను ఏకం చేసింది
రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన తెల్లోళ్ల జెండాకు సలాం కొట్టాల్సిన పరిస్థితులు. అలాంటి సమయంలో ఒక్కడు.. ఒక్కే ఒక్కడు కన్నకల... దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. బ్రిటీషర్లే మన జెండాకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. బాలీవుడ్లో ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే గోల్డ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రొమో కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ‘మన జాతీయ గీతం వస్తోంది.. లేచి నిల్చొండి అంటూ బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా, జాతీయ గీతం బ్యాక్ గ్రౌండ్లో కనిపించి.. వినిపిస్తాయి. వెంటనే ‘అది మీకు ఎలాంటి భావన కలిగించింది?’ అన్న ఓ ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒక్కడు కన్న కల మన జాతీయ గీతానికి బ్రిటీష్ వాళ్లు నిల్చునేలా చేసింది.. అంటూ టీజర్ ను చూపించారు. అక్కీ జాతీయ జెండాను చాటుగా బయటికి తీయటం, హకీ గేమ్ నేపథ్యంలో ఎమోషనల్‌గా టీజర్‌ను కట్ చేశారు. సచిన్ జిగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబోడుచుకునేలా ఉంది. 1948 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో ‘గోల్డ్’ చిత్రం తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఒక్కడు.. ఒక్కే ఒక్కడు కన్నకల.
-
‘మణికర్ణిక’ పరిష్కారం క్రిష్ చేతిలోనే...
సాక్షి, సినిమా : టాలీవుడ్ టాలెండెట్ దర్శకుడు క్రిష్ జాగర్లముడి ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టు మణికర్ణికతో బిజీగా ఉన్నాడు. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.. రాణి లక్ష్మీబాయి జీవితగాథగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తోంది. అయితే ఈ చిత్రానికి ఒప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్లో జాప్యం జరుగుతుండటంతో సమయానికి విడుదల కావటం అనుమానంగా మారింది. దీనికి తోడు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉండటం.. ఈ పరిణామాల నేపథ్యంలో రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ చిత్రం విడుదల కాబోతోంది. ఒలంపిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో గోల్డ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో మణికర్ణిక-గోల్డ్ మధ్య గట్టి పోటీ తప్పదనే అనిపిస్తోంది. అయితే ఈ మధ్యే పద్మావత్ కోసం తన చిత్రాన్ని(ప్యాడ్ మ్యాన్) రిలీజ్‌ను వాయిదా వేసుకున్న అక్కీ.. మరోసారి ఆ పని చేయటమే అనుమానంగానే కనిపిస్తున్నప్పటికీ.. తనతో గబ్బర్ చిత్రానికి పని చేసిన క్రిష్.. మణికర్ణికకు దర్శకుడు కావటం.. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఆ దిశగా చర్చలు జరిపితే వర్కవుట్ అవొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. -
అక్షయ్ ‘గోల్డ్’ టీజర్ అదుర్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి దేశభక్తి మేళవించిన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ శుక్రవారం ‘ప్యాడ్‌మన్’తో థియేటర్లలో అడుగుపెట్టనున్న అక్కీ.. వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి తన తదుపరి చిత్రాన్ని లైన్లో పెట్టాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అక్షయ్ తాజా సినిమా ‘గోల్డ్’.. 1946 ఒలింపిక్స్ లో భారత దేశానికి హాకీలో గోల్డ్ మెడల్ అందించిన హాకీ జట్టు కోచ్ జీవిత కథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. అప్పటివరకు బ్రిటిష్ ఇండియా భాగంగా ఆడిన భారత హాకీ జట్టు తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వర్ణపతకాన్ని సాధించడం వెనుక కోచ్ అందించిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం, ఇందుకోసం కోచ్‌తోపాటు ఆటగాళ్లు పడిన సంఘర్షణ ఇతివృత్తంగా సినిమా తెరకెక్కినట్టు నిమిషం నిడివి ఉన్న టీజర్‌ను బట్టి తెలుస్తోంది. సాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల కానుంది. -
గోల్డ్‌తో హిట్!
ముంబైలోని ఓ స్పోర్ట్స్ గ్రౌండ్లోకి ఉదయం ఏడున్నర గంటలకు అడుగుపెట్టారు హీరో అక్షయ్‌కుమార్. సాయంత్రం ఐదున్నర వరకు అక్కడే ఉన్నారట. ఏదైనా గేమ్ చూడ్డానికి వెళ్లి ఉంటారనకుంటే పొరపాటే. ఆడడానికి వెళ్లారు. గ్రౌండ్లో రెచ్చిపోయి ఆడడం మొదలుపెట్టారు. మరి.. గెలిచారా? అంటే.. చెప్పలేం. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్‌పైనే చూడాలి. అక్షయ్‌కుమార్ హీరోగా దర్శకురాలు రీమా ఖగ్తి రూపొందిస్తున్న చిత్రం ‘గోల్డ్’. హాకీ ప్లేయర్ బల్బీర్‌సింగ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్ బల్బీర్ సింగ్. రీసెంట్గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను ముంబైలో స్టార్ట్ చేశారు. సినిమాలో కీలకమైన రెయినీ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. బల్బీర్ బెంగాలీ అనే విషయం తెలిసిందే. అందుకే స్పెషల్‌గా ఓ కోచ్‌ని పెట్టుకుని బెంగాలీ నేర్చుకుంటున్నారు అక్షయ్. అంతేకాదు.. క్యారెక్టర్లో పర్ఫెక్షన్ కోసం బెంగాలీ కల్చర్, కట్టుబొట్టులపై అక్షయ్ పట్టు సాధిస్తున్నారు. ఇందతా చూస్తుంటే అక్షయ్ సినిమాతో హిట్ గోల్ కొట్టడం పక్కా అని ఊహించవచ్చు. ఇంతకీ ఈ మ్యాచ్ రిలీజ్ డేట్ .. అదేనండీ సినిమా విడుదల ఎప్పుడంటే వచ్చే ఏడాది ఆగస్టులో. -
హ్యాపీ బర్త్‌డే అక్షయ్.. గోల్డ్ పోస్టర్ రీలీజ్
సాక్షి, ముంబై: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒలంపిక్స్‌లో భారత్ ఇప్పటిదాకా ఎన్నో పతకాలు సాధించింది. ముఖ్యంగా ధ్యాన్ఛంద్ నేతృత్వంలో టీమ్ హాకీలో బంగారు పతకాలు సాధించి దేశ ప్రతిష్టతను ప్రపంచం మొత్తం చాటి చెప్పింది. అయితే స్వాతంత్ర్యం భారతావనిలో మొదటి స్వర్ణం ఎలా దక్కించుకుందన్న నేపథ్యంలో బాలీవుడ్ లో ‘గోల్డ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈరోజు ఆయన 50వ పుట్టినరోజు ఈ సందర్భంగా గోల్డ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. మేఘాలకు వెండిపూత ఉంటుంది. కానీ, నా మేఘాలకు మాత్రం బంగారుపూత ఉంది. ఎందుకంటే నా వయసు బంగారంగా మారింది కాబట్టి. నా గుండెను తాకిన చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మీకోసం అంటూ అక్షయ్ కుమార్ తన ట్విట్టర్లో పోస్టర్ ను షేర్ చేశాడు. అంతకు ముందు తన వయసును ప్రతిబింబించేలా సెకన్లతోసహా ఆయన వయసును ట్వీట్ల రూపంలో తెలిపారు. రెండో ప్రపంచయుద్ధం, విభజన, రాజకీయాలు ఇలా అన్ని ప్రతికూల అంశాలతో కుదేలైన ఉన్న భారత్ అయినా సరే 1948 లండన్ లో జరిగిన 14వ ఒలంపిక్స్ గేమ్స్ లో పాల్గొంది. ఫైనల్లో బ్రిటన్ ను ఓడించి స్వర్ణం చేజిక్కిచ్చుకుంది. ఆ కథనంతోనే గోల్డ్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రీమా కగ్టి దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రం ద్వారా మౌనీరాయ్ హీరోయిన్గా పరిచయం కాబోతుంది. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. Every cloud has a silver lining bt with ur love my clouds got a lining of Gold!As my age #TurnsGold,here's the poster of a film close to my❤ pic.twitter.com/TQiaYkbWXs — Akshay Kumar (@akshaykumar) September 8, 2017