గోల్డ్ చిత్రం ప్రోమోలోని ఓ దృశ్యం
రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన తెల్లోళ్ల జెండాకు సలాం కొట్టాల్సిన పరిస్థితులు. అలాంటి సమయంలో ఒక్కడు.. ఒక్కే ఒక్కడు కన్నకల... దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. బ్రిటీషర్లే మన జెండాకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. బాలీవుడ్‌లో ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే గోల్డ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రొమో కాసేపటి క్రితం విడుదల అయ్యింది.
‘మన జాతీయ గీతం వస్తోంది.. లేచి నిల్చొండి అంటూ బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా, జాతీయ గీతం బ్యాక్ గ్రౌండ్‌లో కనిపించి.. వినిపిస్తాయి. వెంటనే ‘అది మీకు ఎలాంటి భావన కలిగించింది?’ అన్న ఓ ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒక్కడు కన్న కల మన జాతీయ గీతానికి బ్రిటీష్ వాళ్లు నిల్చునేలా చేసింది.. అంటూ టీజర్ ను చూపించారు. అక్కీ జాతీయ జెండాను చాటుగా బయటికి తీయటం, హకీ గేమ్ నేపథ్యంలో ఎమోషనల్‌గా టీజర్‌ను కట్ చేశారు.
సచిన్ జిగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబోడుచుకునేలా ఉంది. 1948 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్‌లో ‘గోల్డ్’ చిత్రం తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment