హ్యాపీ బర్త్‌డే అక్షయ్‌.. గోల్డ్‌ పోస్టర్‌ రీలీజ్‌ | Gold Movie New Poster on Akshay Kumar's Birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే అక్షయ్‌.. గోల్డ్‌ పోస్టర్‌ రీలీజ్‌

Published Sat, Sep 9 2017 11:54 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

హ్యాపీ బర్త్‌డే అక్షయ్‌.. గోల్డ్‌ పోస్టర్‌ రీలీజ్‌

హ్యాపీ బర్త్‌డే అక్షయ్‌.. గోల్డ్‌ పోస్టర్‌ రీలీజ్‌

సాక్షి, ముంబై: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒలంపిక్స్‌లో భారత్‌ ఇప్పటిదాకా ఎన్నో పతకాలు సాధించింది. ముఖ్యంగా ధ్యాన్‌ఛంద్‌ నేతృత్వంలో టీమ్‌ హాకీలో బంగారు పతకాలు సాధించి దేశ ప్రతిష్టతను ప్రపంచం మొత్తం చాటి చెప్పింది. అయితే స్వాతంత్ర్యం భారతావనిలో మొదటి స్వర్ణం ఎలా దక్కించుకుందన్న నేపథ్యంలో బాలీవుడ్‌ లో ‘గోల్డ్‌’ పేరిట  ఓ చిత్రం తెరకెక్కుతోంది. యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 
 
ఈరోజు ఆయన 50వ పుట్టినరోజు ఈ సందర్భంగా గోల్డ్‌ ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేశారు. మేఘాలకు వెండిపూత ఉంటుంది. కానీ, నా మేఘాలకు మాత్రం బంగారుపూత ఉంది. ఎందుకంటే నా వయసు బంగారంగా మారింది కాబట్టి. నా గుండెను తాకిన చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ మీకోసం అంటూ అక్షయ్‌ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్టర్‌ ను షేర్‌ చేశాడు. అంతకు ముందు తన వయసును ప్రతిబింబించేలా సెకన్లతోసహా ఆయన వయసును ట్వీట్ల రూపంలో తెలిపారు.
 
రెండో ప్రపంచయుద్ధం, విభజన, రాజకీయాలు ఇలా అన్ని ప్రతికూల అంశాలతో కుదేలైన ఉన్న భారత్‌ అయినా సరే 1948 లండన్‌ లో జరిగిన 14వ ఒలంపిక్స్‌ గేమ్స్‌ లో పాల్గొంది. ఫైనల్లో బ్రిటన్‌​ ను ఓడించి స్వర్ణం​ చేజిక్కిచ్చుకుంది. ఆ కథనంతోనే గోల్డ్‌ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రీమా కగ్టి దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రం ద్వారా మౌనీరాయ్‌ హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement