
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గోల్డ్’. 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్ మెడల్ అందించిన కోచ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గోల్డ్ టీజర్, ట్రైలర్‌లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఐమాక్స్ వర్షన్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఐమాక్స్ వర్షన్ టీజర్‌ను ప్రత్యేకంగా రిలీజ్ చేశారు.
బుధవారం రిలీజ్ అయిన ఐమాక్స్ ప్రత్యేక వర్షన్ టీజర్‌కు కూడా మంచి రెస్సాన్స్ వస్తోంది. ‘జట్టులో ఐకమత్యం లేకపోతే ఎన్నటికీ కప్ గెలవలేం’ ‘చేపకు ఇదటం నేర్పించొద్దు’ లాంటి డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సద్, వినీత్ కుమార్‌సింగ్‌లు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న గోల్డ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment