‘అందుకు సల్మాన్‌ కారణం కాదు’ | Mouni Roy Says She is Upset By Rumours About Her Debut Film Offer | Sakshi
Sakshi News home page

‘అందుకు సల్మాన్‌ కారణం కాదు’

Published Mon, Aug 13 2018 7:06 PM | Last Updated on Mon, Aug 13 2018 7:19 PM

Mouni Roy Says She is Upset By Rumours About Her Debut Film Offer - Sakshi

సల్మాన్‌ ఖాన్‌- మౌనీ రాయ్‌

తన నటనా కౌశల్యంతో పదేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు నటి మౌనీ రాయ్‌(నాగిని ఫేం). ప్రస్తుతం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘గోల్డ్‌’  సినిమాతో ఈ బెంగాలీ భామ తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. తొలి సినిమా విడుదలకు ముందే వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు కూడా. అయితే గోల్డ్‌ సినిమాలో అవకాశం రావడానికి బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కారణం అంటూ బీ- టౌన్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.

ప్రతిభను గుర్తించండి..
ఈ వార్తలపై స్పందించిన మౌనీ రాయ్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ...‘ ఆఫర్‌ వెనుక ఉన్నది ఎవరంటూ నన్ను అడుగుతున్నారు. ఈ ప్రశ్న నన్నడిగే కంటే నా ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను అడిగితే బాగుంటుంది. పదేళ్ల పాటు బుల్లితెరపై వివిధ క్యారెక్టర్లతో నన్ను నేను నిరూపించుకున్నాను. ఆ తర్వాత వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. గోల్డ్‌ సినిమాలో బెంగాలీ గృహిణిగా కన్పించబోతున్నాను. జన్మతః బెంగాలీ అయిన నాకు ఆ పాత్ర దక్కించుకోవడం ఏమంత పెద్ద విషయం. సల్మాన్‌ ఖాన్‌ అంటే నాకెంతో అభిమానం. కేవలం ఈ కారణంగానే నాకు అవకాశాలు వస్తున్నాయంటూ వార్తలు ప్రచారం చేయడం సరికాదు. నా ప్రతిభను గుర్తించకుండా అవకాశాలకు వేరెవరో కారణం అంటే ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రీమా ఖగ్తీ దర్శకత్వంలో రూపొందిన ‘గోల్డ్‌’ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ భార్యగా మౌనీ రాయ్‌ నటిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement