‘ఇప్పుడు సంతోషంగా చనిపోతాను’ | Mouni Roy I Can Now Die Happily After Acting With Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 17 2018 9:09 AM | Last Updated on Sat, Nov 17 2018 9:09 AM

Mouni Roy I Can Now Die Happily After Acting With Amitabh Bachchan - Sakshi

‘నేను ఎంత అదృష్టవంతురాలిని.. ఇంత గొప్ప యాక్టర్‌తో కలిసి నటిస్తున్నాను. ఇప్పుడిక సంతోషంగా చనిపోతానం’టున్నారు నటి మౌని రాయ్. అక్షయ్‌ కుమార్‌ ‘గోల్డ్‌’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు ఈ ‘నాగిని’ ఫేం టీవీ యాక్టర్‌. ప్రస్తుతం బాలీవుడ్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ‘బ్రహ్మస్త్ర’లో మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు మౌని రాయ్. ఒక బ్యూటి కంపెనీ ఉత్పత్తుల ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు మౌని రాయ్‌. ఈ సందర్భంగా అమితాబ్‌తో నటించడం గురించి మాట్లాడుతూ.. ‘బిగ్‌ బీతో నటించాను. తనతో నటించడం కంటే మంచి అవకాశం మరోటి లేదు. ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను’ అంటూ ఉద్విగ్నతకు గురయ్యారు.

‘బ్రహ్మస్త్ర’ షూటింగ్‌లో అమితాబ్‌ మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా అని అడగ్గా.. ‘ప్రత్యేకంగా సలహాలంటూ ఏం ఇవ్వలేదు. కానీ ఆయనతో నటిస్తున్నప్పుడు నా ఫోకస్‌ మొత్తం చెదిరిపోయేది. ఆయన్ని చూసిన ప్రతి సారి నాకు ఎంత గొప్ప అదృష్టం దక్కింది. ఇలాంటి లెజండరి యాక్టర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాను. నిజంగా నేను చాలా లక్కి అంటూ మురిసిపోయేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చారు. ‘గోల్డ్‌’ సినిమా విజయం సాధించిన తర్వాత మౌని రాయ్‌కు బాలీవుడ్‌లో అవకాశాలు వరుస కడుతున్నాయి. ‘బ్రహ్మస్త్ర’తో పాటు ప్రస్తుతం మౌని రాయ్‌ రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోగా వస్తోన్న ‘మేడ్‌ ఇన్‌ చైనా’, జాన్‌ అబ్రహాం ‘రోమియో అక్బర్‌ వాల్తేర్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ విషయం గురించి మౌని రాయ్‌ ‘ఇంత గొప్ప నటులతో కలిసి నటించడం నా అదృష్టం. వీరంతా నన్ను చాలా సపోర్ట్‌ చేస్తారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement