
ముంబైలోని ఓ స్పోర్ట్స్ గ్రౌండ్‌లోకి ఉదయం ఏడున్నర గంటలకు అడుగుపెట్టారు హీరో అక్షయ్‌కుమార్. సాయంత్రం ఐదున్నర వరకు అక్కడే ఉన్నారట. ఏదైనా గేమ్ చూడ్డానికి వెళ్లి ఉంటారనకుంటే పొరపాటే. ఆడడానికి వెళ్లారు. గ్రౌండ్‌లో రెచ్చిపోయి ఆడడం మొదలుపెట్టారు. మరి.. గెలిచారా? అంటే.. చెప్పలేం. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్‌పైనే చూడాలి. అక్షయ్‌కుమార్ హీరోగా దర్శకురాలు రీమా ఖగ్తి రూపొందిస్తున్న చిత్రం ‘గోల్డ్’. హాకీ ప్లేయర్ బల్బీర్‌సింగ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్ బల్బీర్ సింగ్.
రీసెంట్‌గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను ముంబైలో స్టార్ట్ చేశారు. సినిమాలో కీలకమైన రెయినీ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. బల్బీర్ బెంగాలీ అనే విషయం తెలిసిందే. అందుకే స్పెషల్‌గా ఓ కోచ్‌ని పెట్టుకుని బెంగాలీ నేర్చుకుంటున్నారు అక్షయ్. అంతేకాదు.. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం బెంగాలీ కల్చర్, కట్టుబొట్టులపై అక్షయ్ పట్టు సాధిస్తున్నారు. ఇందతా చూస్తుంటే అక్షయ్ సినిమాతో హిట్ గోల్ కొట్టడం పక్కా అని ఊహించవచ్చు. ఇంతకీ ఈ మ్యాచ్ రిలీజ్ డేట్ .. అదేనండీ సినిమా విడుదల ఎప్పుడంటే వచ్చే ఏడాది ఆగస్టులో.
Comments
Please login to add a commentAdd a comment