కాశీలో క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్మెంట్ | Krish Manikarnika Announcement from varanasi | Sakshi
Sakshi News home page

కాశీలో క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్మెంట్

Published Thu, May 4 2017 10:11 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

కాశీలో క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్మెంట్

కాశీలో క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్మెంట్

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన క్రిష్ తన నెక్ట్స్ సినిమాకు కూడా చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నాడు. బాహుబలి సినిమాతో భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన కథా రచయిత విజయేంద్ర ప్రసాధ్ అందించిన రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ గాథను మణికర్ణిక పేరుతో సినిమాగా తెరకెక్కించనున్నాడు. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తోంది.

చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ రోజు (గురువారం) కాశీలో ఎనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే యూనిట్ సభ్యులతో పాటు హీరోయిన్ కంగన కూడా కాశీ చేరుకుంది. సాయంత్రం దశాశ్వమేథ్ ఘాట్ లో జరగనున్న గంగ హారతిలో యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. తరువాత ప్రెస్ మీట్ లో సినిమా ఎనౌన్స్మెంట్ తో పాటు లక్ష్మీభాయ్ లుక్ లో కంగనా 20 అడుగుల పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

బాలీవుడ్ నిర్మాత కమల్ జైన్ భారీ బడ్జెట్ తో ఈ సినమాను నిర్మిస్తుండగా.. సక్సెస్ఫుల్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ ను సంగీతం అందిస్తున్నారు. ప్రసూన్ జోషి మాటలు పాటలు రాస్తున్నారు. మరాఠ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణీ లక్ష్మీభాయ్ 1828లో కాశీలోనే జన్మించింది. అందుకే సినిమా ఎనౌన్స్మెంట్ అక్కడే ప్లాన్ చేశారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement