గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్బస్టర్ సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ క్రిష్, తన నెక్ట్స్ సినిమాను కూడా మరో
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్బస్టర్ సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ క్రిష్, తన నెక్ట్స్ సినిమాను కూడా మరో చారిత్రక గాథ నేపథ్యంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి జాతీయ స్థాయిలో బాలీవుడ్లో సినిమాచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఝాన్సీ రాని లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక అనే సినిమాను తెరకెక్కించనున్నాడు క్రిష్.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న మణికర్ణిక సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెన్సిల్ స్కెచ్లా ఉన్న ఈ పోస్టర్ లో కంగనా లక్ష్మీభాయ్ లుక్లో ఆకట్టుకుంటోంది. అయితే క్రిష్, ఈ లుక్ పై అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు.