
కష్టాల్లో క్రిష్ 'మణికర్ణిక'..!
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తన నెక్ట్స్ సినిమాగా మరో భారీ చారిత్రక చిత్రం చేస్తున్న
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తన నెక్ట్స్ సినిమాగా మరో భారీ చారిత్రక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవల కాశీలో గ్రాండ్గా లాంచ్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాపై అప్పుడే వివాదాలు మొదలయ్యాయి. తను రాసుకున్న కథను దొంగిలించి కంగనా వేరే దర్శకుడితో మణికర్ణిక సినిమా చేస్తుందంటూ కేతన్ మెహతా కోర్టును ఆశ్రయించాడు.
తాజాగా క్రిష్ మణికర్ణికకు మరో సమస్య ఏర్పడింది. మణికర్ణికకు ముందే నిర్మాత స్వాతి భిసే, ఝాన్సీ రాణి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఝాన్సీకి రాణి పేరుతో తన కూతురు దేవికా భిసే ప్రధాన పాత్రలో ఈ సినిమా నిర్మాణం ప్రారంభించింది. హాలీవుడ్లో 'ది మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ' సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్ అయిన స్వాతి, ఆ పరిచయాలతో ఝాన్సీకి రాణీ చిత్రాన్ని హాలీవుడ్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మణికర్ణిక ఎనౌన్స్మెంట్ తరువాత స్పీడు పెంచిన ఝాన్సీకి రాణీ టీం.. ఈ ఏడాది చివరల్లో తమ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే మణికర్ణిక మీద ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందని భావిస్తున్నారు.