షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘మణికర్ణిక’ | Kangana Ranaut Manikarnika Shooting Completed | Sakshi

Oct 13 2018 10:14 AM | Updated on Oct 13 2018 10:14 AM

Kangana Ranaut Manikarnika Shooting Completed - Sakshi

ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే క్రిష్‌.. యన్‌.టి.ఆర్‌ షూటింగ్‌లో బిజీ కావటంతో మణికర్ణిక చిత్రానికి కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆఖరి పాట చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో జరుగుతోం‍ది. ఈ దీంతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement