
సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బ్యూటీ చారిత్రక కథతో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ డైరెక్షన్ చేయగా చివరి షెడ్యూల్‌కు కంగనా స్వయంగా దర్శకత్వం వహించారు.
బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ బిజీగా కావటంతో మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలు కంగన తీసుకున్నారు. ఒకే సినిమాలో నటిగా, దర్శకురాలిగా పనిచేస్తుండటంతో రెమ్యూరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నారట కంగనా. గతంలో ఒక్కో సినిమా 5 నుంచి 6 కోట్ల పారితోషికం తీసుకున్న ఈ భామ ఈ సినిమాకు డబుల్ కన్నా ఎక్కువగా తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది.
ఈసినిమాకు ఈ బ్యూటీ ఏకంగా 14 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టుగా బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం పద్మావత్‌కు దీపిక తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ కావటంతో బాలీవుడ్ ప్రముఖులు షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్ననటిగా రికార్డ్ సృష్టించనుంది కంగనా. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మణికర్ణిక జనవరి 25న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment