
హెడ్డింగ్ చదవగానే కంగనా రనౌత్ కొత్త భాష ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారేమో? లేక ఏదైనా కొత్త ఆట మీద దృష్టి పెట్టారేమో అనుకుంటున్నారా? రెండోది నిజం. ఇప్పుడు కంగనా రనౌత్ తన ఫోకస్ అంతా కబడ్డీ ఆట మీద పెట్టారు. ఎందుకంటే ఓ సినిమాలో ఆమె కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్నారు. ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ‘పంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సినిమాకు ‘బరేలీ కీ బర్ఫీ ఫేమ్’ అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. నీనా గుప్తా, జెస్సీ గిల్ కీలక పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కంగనా రనౌత్ భర్తగా జెస్సీ గిల్ కనిపిస్తారట. అంతా బాగానే ఉంది. కంగనాకి కబడ్డీ ఆట తెలియదట. ఈ సినిమా షూటింగ్ ఆరంభించక ముందే నేర్చుకుంటేనే సెట్‌లో అంతా సవ్యంగా సాగుతుంది. అందుకే సులువుగా కబడ్డీ నేర్పించే కోచ్‌ను వెతుకుతున్నారట టీమ్. మరి.. కోచ్ దొరికేదెప్పుడు? ఆట నేర్చుకునేదెప్పుడు?
Comments
Please login to add a commentAdd a comment