
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘మణికర్ణిక’. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించడం విశేషం.
కాగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మణికర్ణిక ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. లక్ష్మీబాయి జీవితంలోని అన్ని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడే యోధురాలిగా కంగన తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment