
కంగనా రనౌత్
కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘మణికర్ణిక’. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామారావు జీవితకథతో తెరకెక్కుతోన్న ‘యన్.టి.ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు క్రిష్. కొన్ని ప్యాచ్ వర్క్స్ కోసం కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో ఈ చిత్రంలోని ఆఖరి పాట షూటింగ్ జరిగింది. కంగనా యుద్ధ విన్యాసాలు ఈ చిత్రంలో హైలెట్ అట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ‘మణికర్ణిక’ సినిమాని విడుదల చేసేందుకు చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment