దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేస్తారా.? | Neelakanta Prashanth Varma Not Taking Credit For That is Mahalakshmi | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 3:17 PM | Last Updated on Sat, Feb 2 2019 3:17 PM

Neelakanta Prashanth Varma Not Taking Credit For That is Mahalakshmi - Sakshi

ప్రస్తుతం సౌత్, నార్త్‌ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన సినిమా మణికర్ణి. ఈ సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించటం ప్రధా పాత్రధారి కంగనాతో వివాదం కారణంగా క్రిష్ తప్పుకోవటంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా టైటిల్స్‌లో దర్శకులుగా కంగనా, క్రిష్‌ పేర్లు కనిపించాయి. అయితే మేజర్‌ పార్ట్ డైరెక్ట్‌ చేసిన తనకే ఎక్కువ క్రెడిట్ దక్కాలంటూ సోషల్ మీడియా వేదిక గొడవపడుతున్నారు.

అలాంటి పరిస్థితే ఓ సౌత్ సినిమాకు కూడా ఏర్పడింది. బాలీవుడ్ సూపర్‌ హిట్ క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సౌత్ సినిమా దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ. ఈసినిమాకు ముందుకు షో ఫేం నీలకంఠ దర్శకత్వం వహించాడు. తరువాత లీడ్‌ యాక్టర్‌ తమన్నాతో వివాదం కారణంగా నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మిగతా భాగానికి అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరి ఈ ఇద్దరిలో సినిమాకు దర్శకుడిగా క్రెడిట్ ఎవరికి ఇస్తారు. ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చేట్టయితే ముందుగా ఎవరి పేరు వేస్తారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ టీం పోస్టర్లు, టీజర్‌లను దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేసింది. మరి సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా లేక మరో వివాదానికి తెరతీస్తారా చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement