That Is Mahalakshmi
-
సినిమా పూర్తై ఎనిమిదేళ్లు.. ఓటీటీకి వస్తోన్న ప్రశాంత్ వర్మ మూవీ!
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన చిత్రం దటీజ్ మహాలక్ష్మి . ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికే దాదాపు ఎనిమిదేళ్లు పూర్తవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత వర్మ దర్శకత్వం వహించారు. కాగా.. కంగన రనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా దటీజ్ మహాలక్ష్మి మూవీని 2014లో ప్రకటించారు. 2016లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా రిలీజ్ కాలేదు. సినిమా విడుదల కాకపోవడంతో ఈ సినిమా గురించి ఆడియన్స్ కూడా మర్చిపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయి ఇప్పటికే ఎనిమిదేళ్లు కావడంతో థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరించడం కష్టమేనని భావించినట్లు తెలుస్తోంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీపై క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్రలో కనిపించారు. అయితే గతంలోనూ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. -
హర్రర్ సినిమాతో మాలీవుడ్‌కి!
కాస్త లేటైనా లేటెస్ట్గా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడు ఐదో భాషలో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది. తమన్నా పేరు చెప్పగానే ముందగా అభిమానులకు గుర్తుకొచ్చేది ఆమె గ్లామరస్ నటనే. ఈ మరాఠి ముద్దుగుమ్మ తన 15వ ఏటనే నటిగా తెరంగేట్రం చేసింది. ఇప్పుడీమె వయసు ముచ్చటగా మూడు పదులను టచ్ చేయబోతోంది. నటిగా తన 14 ఏళ్ల కాలంలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో నటించేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ నటిగా రాణించేస్తోంది. ఇటీవల నాగార్జునకు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రసారం జోరుగా సాగింది. అయితే హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగానే ఉందీ భామ. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రను తమన్న పోషించింది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తను ప్రధాన పాత్రలో నటించిన దటీజ్ మహాలక్ష్మీ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం తమిళంలో విశాల్‌కు జంటగా సుందర్.సీ దర్శకత్వంలో యాక్షన్ అనే చిత్రంతో పాటు పెట్రోమాక్స్ అనే హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. ఇది హర్రర్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుంది. కాగా ఇంతకు ముందు కూడా దేవి, దేవి 2 వంటి హర్రర్ ఇతి వృత్తాలతో కూడిన చిత్రాల్లో నటించింది. ఈ విషయం గురించి ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే ఈ అమ్మడిని ఇటీవల హర్రర్ కథా చిత్రాలు ఎక్కువగా వరిస్తున్నాయి. తాజాగా మరో హర్రర్ కామెడీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అయితే మాలీవుడ్ ప్రేక్షకులను హర్రర్, కామెడీతో అలరించబోతోందన్నది తాజా సమాచారం. అవును మలయాళ చిత్రంలో తమన్న నటించబోతోంది. ఇదే ఈ బ్యూటీ నటిస్తున్న ఐదో భాష చిత్రం. ఈ సినిమాకు ‘సెంట్రల్‌జైల్ ప్రీతమ్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంధ్యామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది జైలులో జరిగే వినోదాత్మక హారర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. మొత్తం మీద అలా కాస్త లేట్ అయినా లేటెస్ట్గా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. చూద్దాం అక్కడ ఈ అమ్మడి లక్ ఎలా ఉంటుందో. -
దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేస్తారా.?
ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన సినిమా మణికర్ణి. ఈ సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించటం ప్రధా పాత్రధారి కంగనాతో వివాదం కారణంగా క్రిష్ తప్పుకోవటంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా టైటిల్స్‌లో దర్శకులుగా కంగనా, క్రిష్ పేర్లు కనిపించాయి. అయితే మేజర్ పార్ట్ డైరెక్ట్ చేసిన తనకే ఎక్కువ క్రెడిట్ దక్కాలంటూ సోషల్ మీడియా వేదిక గొడవపడుతున్నారు. అలాంటి పరిస్థితే ఓ సౌత్ సినిమాకు కూడా ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సౌత్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మీ. ఈసినిమాకు ముందుకు షో ఫేం నీలకంఠ దర్శకత్వం వహించాడు. తరువాత లీడ్ యాక్టర్ తమన్నాతో వివాదం కారణంగా నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మిగతా భాగానికి అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో సినిమాకు దర్శకుడిగా క్రెడిట్ ఎవరికి ఇస్తారు. ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చేట్టయితే ముందుగా ఎవరి పేరు వేస్తారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన దట్ ఈజ్ మహాలక్ష్మీ టీం పోస్టర్లు, టీజర్లను దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేసింది. మరి సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా లేక మరో వివాదానికి తెరతీస్తారా చూడాలి. -
మహాలక్ష్మి ముస్తాబు
ఓ సాధారణ యువతి అసాధారణ మహిళగా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’. తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. టైజాన్ ఖొరాకివాలా సమర్పణలో మెడైంటే ఇంటర్నేషనల్ పతాకంపై మను కుమరన్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మను కుమరన్ మాట్లాడుతూ– ‘‘హిందీలో ఘన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ పనులు మొదలు పెట్టాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాం. అమిత్ త్రివేది చక్కని సంగీతం అందించారు. మైఖెల్ ట్యాబ్యురియస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పరుల్ యాదవ్, పంకజ్ కపూర్, కె. వెంకట్రామన్, మనోజ్ కేశవన్ లైగర్, త్యాగరాజన్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: జి. మోహన్ చంద్రన్, హేటల్ యాదవ్, యోగేష్ ఈశ్వర్ ధబువాలా. -
లండన్ దాకా డోల్‌బాజే అంటున్న తమన్నా
తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మి. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకోగా తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రధాన పాత్ర మహాలక్ష్మి పెళ్లి వేడుకు సంబంధించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సంగీతమందించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతమందించిన ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. -
మహాలక్ష్మి పెళ్లి సందడి మూడు రోజుల్లో..!
బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకోగా త్వరలో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. జనవరి 16న సినిమాలో పెళ్లివేడుకకు సంబంధించిన పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. -
మహాలక్ష్మి సందడి మొదలవుతోంది..!
బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకోగా డిసెంబర్ 21న టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. -
మన ఇంటి మహాలక్ష్మి
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘క్వీన్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ‘దటీజ్ మహాలక్ష్మి’తో మరోసారి సత్తా చాటుకోబోతుంది తమన్నా భాటియా. తమన్నా కెరీర్లో ‘మహాలక్ష్మి’ మరువలేని పాత్ర. ‘సిల్క్చీర కట్టుకున్న సాఫ్ట్వేర్రో..పోనీటెయిల్ కట్టుకున్న ఫస్ట్ర్యాంకురో.... దటీజ్ మహాలక్ష్మి దటీజ్ మహాలక్ష్మి’ అని హాయిగా పాడుకునే పాత్ర. తనకు అచ్చొచ్చిన పేరుతో ముందుకు వస్తున్న కలలరాణి తమన్నాభాటియా గురించి కొన్ని ముచ్చట్లు... నచ్చేసింది ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సినిమాలు తెగ చూస్తుంది. ‘మొఘల్–ఏ–ఆజామ్’ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలు చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదు. తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన పాత్ర ‘మహాలక్ష్మి’. ‘100%›లవ్’ సినిమాలో మహాలక్ష్మి పాత్ర నటనపరంగా తమన్నాను మరో మెట్టు పైకి ఎక్కించింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. పాటల కోసమే అన్నట్లు ఉండే పాత్రల్లో నటించడం కంటే శక్తిమంతమైన, స్వాభిమానం ఉన్న పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతుంది. ఎలా అంటే ఇలా... ప్రొఫెషన్లో భాగంగా ప్రపంచంలో ఎన్నెన్నో నగరాలు తిరిగినా...హైదరాబాద్ అంటే ప్రత్యేక ఇష్టం అని చెబుతుంది తమన్నా. ఈ నగరం తనకు పాజిటివ్ వైబ్స్ ఇస్తుందట. ఇక్కడి బిర్యానీ, చేపలపులుసు అంటే మహాఇష్టం అని చెబుతుంది మహాలక్ష్మి.తమన్నా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ‘హౌ?’ అనే క్వశ్చన్ ఆశ్చర్యంగా పైకి వచ్చినప్పుడు తాను చెప్పే సమాధానం ఇది: ‘నేను ఇక్కడి అమ్మాయినే అనుకుంటాను. ఇలా అనుకోవడం వల్లే కావచ్చు తెలుగు పరాయిభాష అనిపించదు. అసిస్టెంట్లతో కావచ్చు ఇతరులతో కావచ్చు...తెలుగులోనే మాట్లాడడం వల్ల భాష సులభమైపోయింది. సై సినిమా అనేది డైరెక్టర్ మీడియం, విజన్ కాబట్టి స్క్రిప్ట్‌తో పాటు డైరెక్టర్ ఎవరనేదానికి కూడా ప్రాధాన్యత ఇస్తానంటుంది. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు డిమాండ్‌ను బట్టి డీగ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సై అంటుంది. ‘ఊసరవెల్లి’ రెండవభాగంలో డీగ్లామర్డ్గా నటించింది. కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ చేయడంలో బెరుకు కంటే ఉత్సాహమే తన ముందుంటుంది. ‘ఆనందతాండవం’లో మధుమిత సవాలు విసిరే పాత్ర. బాడీలాంగ్వేజ్ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకొని మరీ ఈ పాత్రలో నటించి భేష్ అనిపించుకుంది తమన్నా. తత్వం బోధపడింది వృథా ఖర్చుకు దూరంగా ఉంటుంది. అవసరమైన వాటినే కొంటుంది. ఆర్థిక క్రమశిక్షణ గురించి మాత్రమే కాదు...కాస్తో కూస్తో ఫిలాసఫీ మాట్లాడుతుంటుంది ఈ అమ్మడు. మచ్చుకు... ‘జీవితం శాశ్వతమేమీ కాదు. జీవితంలో ఏదో ఒకరోజు చివరిరోజు కాక తప్పదు. కాబట్టి ఈ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి’ -
‘దటీజ్ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్
బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లంగా వోణీలో ఉన్న తమన్నా పారిస్‌లోని ఐఫిల్ టవర్ ముందు డాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. -
గుమ్మడికాయ కొట్టారు
ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లు నలుగురు రాణులు ఒకేసారి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారట. హిందీ హిట్ ‘క్వీన్’ సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రధారిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’ రూపొందింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహారావు, మాస్టర్ సంపత్ కీలక పాత్రలు చేశారు. బాలీవుడ్ స్టార్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తమిళ క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్, కన్నడ వెర్షన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ నటించారు. మలయాళంలో మంజిమా మోహన్ నాయికగా ‘జామ్ జామ్’ టైటిల్‌తో రీమేక్ అయింది. -
‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ మూవీ స్టిల్స్