మహాలక్ష్మి పెళ్లి సందడి మూడు రోజుల్లో..! | Wedding Song From That is Mahalakshmi Releasing on Jan16th | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 13 2019 4:19 PM | Last Updated on Sun, Jan 13 2019 4:19 PM

Wedding Song From That is Mahalakshmi Releasing on Jan16th - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ హిట్ ‘క్వీన్‌’ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలో ఒకేసారి రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  భాషల్లో ఈ రీమేక్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దట్‌ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో అ! ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఇప్పటికే  టీజర్‌తో ఆకట్టుకోగా త్వరలో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. జనవరి 16న సినిమాలో పెళ్లివేడుకకు సంబంధించిన పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. ఈ సినిమా తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్‌లో కాజల్‌, మలయాళ వర్షన్‌లో మంజిమా మోహన్‌, కన్నడ వర్షన్‌లో పరుల్‌ యాదవ్‌లు లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement