Queen remake
-
కాజల్ కొత్త అవతారం
సమాజసేవ చేస్తున్నానంటోంది నటి కాజల్ అగర్వాల్. ఏమిటీ సడన్‌గా సమాజంపై ప్రేమ పుట్టుకొచ్చింది? కొంపదీసి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఉందా? ఏమిటి? అనే సందేహం కలగడంలో తప్పులేదు. అయితే దాని గురించి ప్రస్తావన కాజల్ తీసుకురాలేదు. పెళ్లి ఊసు ఎత్తితే ఈ జాణ సామాజిక సేవను తెరపైకి తీసుకొచ్చింది. ఈ అమ్మడికిప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ప్యారిస్ ప్యారిస్‌లో నటించింది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇక కమలహాసన్‌తో శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిన కాజల్‌అగర్వాల్‌కు ఆ చిత్రం నిర్మాణంలో జాప్యం కాస్త నిరాశ పరుస్తోంది. ఇప్పుటికే ప్రారంభం కావలసిని ఇండియన్–2 చిత్రం కమలహాసన్ ఎన్నికల బరిలోకి దిగడంతో అవి పూర్తి అయ్యేవరకూ వేచి ఉండక తప్పనిపని. ఈ సందర్భంగా తన సినీ పయనం గురించి కాజల్ తెలుపుతూ తనను కలిసిన వారందరూ పెళ్లెప్పుడూ అని అడుగుతున్నారని, అయితే ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారిస్తున్నానని చెప్పింది. అయితే పెళ్లి అనేది అందరికీ తెలిసేలానే చేసుకుంటానని అంది. తమిళంలో నటించిన ప్యారిస్ ప్యారిస్ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నానని తెలిపింది. ఇటీవల యువ కథానాయకులతోనే నటిస్తున్నారేమిటని అడుగుతున్నారని, అయితే ఎవరితో నటిస్తున్నాను అన్నదానికంటే ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నానన్నదే ముఖ్యం అని చెప్పింది. మంచి కథ, పాత్ర అయితే ఏ నటుడితోనైనా నటించడానికి సిద్ధం అని పేర్కొంది. ప్రస్తుతం తాను సామాజిక సేవపై దృష్టి పెట్టినట్లు చెప్పింది. అందుకు తన సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రాలోని అరకు అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ఆదివాసుల పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేక అవస్థలు పడడం చూశానని, దీంతో నిధిని సేకరించి ఆ ప్రాంతంలో పాఠశాలను కట్టించినట్లు కాజల్‌అగర్వాల్ తెలిపింది. తాను మంచి విషయాల గురించే మాట్లాడతానని అంది. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, అలాంటి వారిని ప్రోత్సహించడం తప్పేనని కాజల్ అంటోంది. -
మహాలక్ష్మి ముస్తాబు
ఓ సాధారణ యువతి అసాధారణ మహిళగా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’. తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. టైజాన్ ఖొరాకివాలా సమర్పణలో మెడైంటే ఇంటర్నేషనల్ పతాకంపై మను కుమరన్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మను కుమరన్ మాట్లాడుతూ– ‘‘హిందీలో ఘన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ పనులు మొదలు పెట్టాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాం. అమిత్ త్రివేది చక్కని సంగీతం అందించారు. మైఖెల్ ట్యాబ్యురియస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పరుల్ యాదవ్, పంకజ్ కపూర్, కె. వెంకట్రామన్, మనోజ్ కేశవన్ లైగర్, త్యాగరాజన్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: జి. మోహన్ చంద్రన్, హేటల్ యాదవ్, యోగేష్ ఈశ్వర్ ధబువాలా. -
మహాలక్ష్మి పెళ్లి సందడి మూడు రోజుల్లో..!
బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకోగా త్వరలో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. జనవరి 16న సినిమాలో పెళ్లివేడుకకు సంబంధించిన పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. -
అశ్లీల సన్నివేశంపై నెటిజన్ల ఆగ్రహం
సినిమా: కాజల్ నీకిది తగునా అని నెటిజన్లతో పాటు పలువురు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఈ అమ్మడిపై మండిపడడానికి కారణం ఏమిటా అనేగా మీ ఆసక్తి. ఈ బ్యూటీ ఇంతకుముందు పలు చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించినా, తనకుంటూ ఒక ఇమేజ్ను ప్రేక్షకుల్లో సంపాదించుకుంది. అలాంటిది ఇటీవల చేతిలో అవకాశాలు తగ్గుతున్నాయనుకుందో పాత్ర డిమాండ్ చేసిందో గానీ, ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో ఒక సన్నివేశంలో చాలా అశ్లీలంగా నటించింది. ఈ బ్యూటీ ఇన్నేళ్లలో హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఇదే. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్ర తమిళ రీమేక్‌లో కాజల్‌అగర్వాల్ నటిస్తోంది. ఇదే చిత్రం తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో నటి తమన్నా నటిస్తోంది. కాగా రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న తమిళ వర్షన్ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ప్యారిస్ ప్యారిస్ చిత్ర ట్రైలర్ మిశ్రమ స్పందననే పొందింది. పైగా ఇందులో కాజల్ నటించిన ఒక అశ్లీల సన్నివేశంపై ప్రేక్షకులు, నెటిజన్లు మండిపడుతున్నారు. కాజల్ ఇప్పుడిలాంటి సన్నివేశాల్లో నటించడం నీకవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై కాజల్‌అగర్వాల్ స్పందించలేదుగానీ, దర్శకుడు రమేశ్ అరవింద్ మాత్రం ఆ సన్నివేశాన్ని సమర్థించుకున్నారు. ఆయన స్పందిస్తూ చిత్ర ట్రైలర్ మాత్రమే చూడడంతో మీకలా అనిపిస్తుంది గానీ, అంతకుముందు, ఆ తరువాత వచ్చే సన్నివేశాలతో కలిపి చూస్తే అందుకు కారణం తెలుస్తుందని అన్నారు. అలాంటి సన్నివేశం హిందీ చిత్రంలోనూ ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందీలో ఈ పాత్రను పోషించిన కంగనా రనౌత్ జాతీయ అవార్డును గెలుచుకున్నారన్నది గమనార్హం. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం నటుడు కమలహాసన్‌తో కలిసి ఇండియన్–2లో నటించడానికి తయారవుతోంది. -
‘దటీజ్ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్
బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లంగా వోణీలో ఉన్న తమన్నా పారిస్‌లోని ఐఫిల్ టవర్ ముందు డాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. -
గుమ్మడికాయ కొట్టారు
ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లు నలుగురు రాణులు ఒకేసారి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారట. హిందీ హిట్ ‘క్వీన్’ సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రధారిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’ రూపొందింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహారావు, మాస్టర్ సంపత్ కీలక పాత్రలు చేశారు. బాలీవుడ్ స్టార్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తమిళ క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్, కన్నడ వెర్షన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ నటించారు. మలయాళంలో మంజిమా మోహన్ నాయికగా ‘జామ్ జామ్’ టైటిల్‌తో రీమేక్ అయింది. -
షూటింగ్ పూర్తిచేసుకున్న ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’
మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మిల్క్‌బ్యూటీ తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘దట్ ఈజ్ మాహాలక్ష్మీ’. బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాకి ఇది రిమేక్. కాగా తాజాగా జరిగిన యూరప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు మరియు మాస్టర్ సంపత్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహకాలు చేస్తుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్న తరువాత యూనిట్ సభ్యులతో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారు. తరవుత ‘అ’ ఫేం ప్రశాంత వర్మ ఈ ప్రస్టీజియస్ రీమేక్‌ను పూర్తి చేశారు. -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సౌత్ సినిమా సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన తమన్నా కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కార కాలానికి పైగానే పూర్తయ్యింది. ఇన్నేళ్లలో గ్లామరస్ బ్యూటీగా ఆకట్టుకున్న తమన్నాకు నటిగా ప్రూవ్ చేసుకునేందుకు మాత్రం అవకాశాలు దక్కలేదు. కొంత కాలంగా సరైన అవకాశాలు లేకపోవటంతో పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టారు తమన్నా. ఇప్పటికే ఆమె కుటుంబం సభ్యులు వరుడ్నికూడా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో త్వరలోనే తమన్నా వివాహం జరుగునుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై తమన్నా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ క్వీన్ రీమేక్‌తో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమాల్లో నటిస్తున్నారు. -
ప్యారిస్‌లో పరమేశ్వరి
అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకే పెళ్లి వద్దన్నాడు. చేసేదేం లేక ఒంటరిగా ప్యారిస్‌కు ప్రయాణమైంది పరమేశ్వరి. ఈ జర్నీలో తన అనుభవాలేంటి? తను నేర్చుకున్నదేంటి తెలియాలంటే ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రం చూడాల్సిందే అని కాజల్ అగర్వాల్ అంటున్నారు. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటుడు, దర్శకుడు రమేశ్ అరవింద్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు చిత్రాలను మీడెంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ నిర్మిస్తోంది. తమిళ వెర్షన్లో కాజల్ అగర్వాల్ పరమేశ్వరి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేశారు చిత్రబృందం. వచ్చే నెలలో ట్రైలర్‌ను, ఏడాది చివర్లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. -
ప్రేమ పెళ్లే చేసుకుంటా..!
సాక్షి, చెన్నై: నాకు పెళ్లెప్పుడవుతుంది అని కూనిరాగాలు తీస్తోంది నటి మంజిమామోహన్. ఆ కథేంటో చూద్దామా! ‘అచ్చంయంబ్బదు మడమయడా’ చిత్రంతో తమిళంలోనూ, అదే చిత్రంతో తెలుగులోనూ ఏకకాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన లక్కీబ్యూటీ మంజిమామోహన్. ప్రస్తుతం హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌లోనూ, తమిళంలో గౌతమ్కార్తీక్కు జంటగా దేవాట్టం చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్న ఈ వర్ధమాన నటి సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్ర: నటి కాకపోతే ఏమై ఉండేవారు? జ: నేను 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశపడ్డాను. పది పూర్తి అయిన తరువాత వేసవి సెలవుల్లో రెండు నెలలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకునే ప్రయత్నం చేశాను. అయితే అప్పుడే ఈ రంగంలో నేను పనికి రానని అర్థం అయిపోయింది. దీంతో ఆ ఆశకు నీళ్లొదిలేశాను. ప్ర: స్టెల్లా మేరీ కళాశాల విద్యార్థిని అయిన మీకు అప్పటి చెన్నైకి, ఇప్పటి చెన్నైకి ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా? జ: కచ్చితంగా. కాలేజీ జీవితం అంటేనే వేరు కదా! అప్పుడు నేను బస్, ఆటోల్లో ప్రయాణం చేసేదాన్ని. ఇప్పుడు అలా కుదరదు. ఒక చోట 10మంది ఉంటే అందులో కనీసం ముగ్గురైనా నన్ను గుర్తు పడతారు. అందువల్ల ఇప్పుడు అంత స్వేచ్ఛగా తిరగడం కుదరదు. అయితే అలాంటి సందర్భం వస్తే చెన్నైలోని ఎంటీసీ బస్సులో పయనించాలన్న కోరిక ఉంది. ప్ర: షూటింగ్ లేని సమయాల్లో మీకు కాలక్షేపం? జ: బాగా నిద్ర పోతాను. కుదిరితే రోజంతా నిద్రలోనే గడిపేస్తా. ఏదైనా సినిమా చూస్తాను. పాటలు వింటాను. ఇటీవల యోగా చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి యోగా చాలా ఉపయోగ పడుతోంది. నాకు వంటింటి పరిచయం కూడా ఉంది. ఆప్లేట్ వేయడం, చికెన్ వండడం వంటివి తెలుసు. మీరు నవ్వనంటే ఒక విషయం చెబుతా. వంట పాత్రలు కడగడం అంటే నాకు చాలా ఇష్టం. ప్ర: చెన్నైలో మీకు నచ్చిన ప్రాంతం? జ: సత్యం సినిమా థియేటర్. అదేమిటో తెలియదుగానీ ఆ థియేటర్లో సినిమా చూస్తే ఆ సుఖమే వేరు. అక్కడ పాప్‌కార్న్, కోల్డ్ కాఫీ బాగుంటాయి. సినిమా టికెట్ బుక్ చేసినప్పుడే పాప్‌కార్న్‌తో కలిపే బుక్ చేసుకుంటాను. ఆ తరువాత శాంథోమ్ చర్చ్‌కు తరచూ వెళుతుంటాను. నా మనసుకు దగ్గరైన ప్రాంతం అది. ప్ర: ఈ తరం హీరోయిన్లు గాయనీగానూ అవతారమెత్తుతున్నారు.మీకు అలాంటి కోరిక? జ: నాకు అలాంటి ఆశ లేదు. ఆ అర్హతా ఉందనుకోను. ఇప్పుడు అంతా ఆటోట్యూనేగా మీరు ఈజీగా పాడవచ్చుగా అని కొందరు అడిగారు. అయితే తెలియని విషయాన్ని నేనెప్పుడూ చేయను. ప్ర: మీరు తరచూ కూని రాగాలు తీసే పాట? జ: ఇటీవల నయనతార నటించిన చిత్రంలోని నాకు ఎప్పుడో పెళ్లి వయసు వచ్చిందే (ఎనక్కు ఎప్పో కల్యాణ వయసు వందుటుచ్చుడీ) పాటను తరచూ హమ్ చేస్తుంటాను. ప్ర: సరే మీ పెళ్లెప్పుడూ? జ: ఆహాహా.. ఇప్పట్లో కచ్చితంగా ఉండదు. మరో ఏడెనిమిదేళ్ల తరువాతే. అదీ ప్రేమ పెళ్లే చేసుకుంటా. -
వంట చేయడం భలే సరదా
ఖాళీ సమయాల్లో ఒక్కొక్కరికీ ఒక్కో హాబీ ఉంటుంది. కొందరు పుస్తకాలు చదువుతారు. మరికొందరు గార్డెనింగ్ చేస్తారు. మరి హీరోయిన్ కాజల్ ఏం చేస్తారో తెలుసా? వంట చేస్తారట. ఈ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ –‘‘నటిగా డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటాం. ఇంటికి దూరంగా షూటింగ్ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే మాత్రం వంట చేస్తాను. రిలాక్స్ అవ్వడానికి వంటని స్ట్రెస్‌బస్టర్‌గా భావిస్తాను. అలాగని మామూలు షెఫ్‌ని కాదు. టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో వాళ్లకు ఫుడ్ ప్రిపేర్ చేయడంలో భలే సరదా ఉంటుంది. నేను చేసే ఆమ్లెట్ అంటే మా ఇంట్లో వాళ్లకు చాలా ఇష్టం. సో.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు వంట చేయడానికి ప్రిఫర్ చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ చిత్రం క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
క్వీన్ కోసం ‘అ’ దర్శకుడు
బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. అయితే తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇతర భాషల్లో రీమేక్ పనులు జరుగుతున్నా తెలుగు వర్షన్‌ను మాత్రం పక్కన పెట్టేశారు. తాజా మరో దర్శకుడితో క్వీన్ తెలుగు రీమేక్‌ను కొనసాగించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. నాని నిర్మాతగా మారి రూపొందించిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ, క్వీన్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్ కు మంచి స్పందన వచ్చింది. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. -
పెప్పర్ స్ప్రే సరిపోదు.. అంతకు మించి!
ఆ మధ్య అనుష్క ఓ పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొంటే ఎవరో ఆకతాయి తాకాడు. అంతకుముందు శ్రియ తిరుమల వెళ్లినప్పుడు ఇలాంటి సంఘటనే. మొన్న సనూష ట్రైన్లో వెళ్లినప్పుడు ఓ చేదు అనుభవం. మిల్క్ బ్యూటీ తమన్నా ఓ వేడుకలో పాల్గొంటే ఓ ఆకతాయి చెప్పు విసిరాడు. కథానాయికలకు ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామందిలో ఈ ప్రశ్న ఉంది. కథానాయికలనే కాదు.. మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. దీని గురించి కథానాయిక మంజిమా మోహన్ మొహమాటం లేకుండా మాట్లాడారు. ‘‘అసలు ట్రైన్లో ఒక మహిళతో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవరిస్తుంటే మిగతా ప్యాసింజర్లందరూ ఎందుకు కామ్‌గా ఉన్నారో, ఆ సమయంలో వాళ్లు ఏం ఆలోచించారో అర్థం కావడం లేదు’’ అని సనూషకు ఎదురైన అనుభవం గురించి అన్నారు. ఇంకా మంజిమా మోహన్ మాట్లాడుతూ – ‘‘ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు సెఫ్టీ కోసం పెప్పర్ స్ప్రేను బ్యాగ్‌లో క్యారీ చేయమని నా బ్రదర్ సలహా ఇచ్చేవాడు. ‘నీకేమైనా పిచ్చా. పాతకాలపు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో మహిళలకు ఎంతో సెఫ్టీ ఉంది’ అని నేను తనతో అనేదాన్ని. కానీ ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నా మాటలు నిజం కాదని అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న అరాచకాల నుంచి బయటపడటానికి పెప్పర్ స్ప్రే మాత్రమే కాదు.. అంతకుమించిన వస్తువులను ఏవో మహిళలు తమ వెంట ఉంచుకోవాలేమో అనిపిస్తోంది. ఈ పరిస్థితులో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలను ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూడడం మానుకోవాలి. వారి అభిప్రాయాలకు, ఆత్మగౌరవానికి విలువ ఇవ్వాలి’’ అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ‘క్వీన్’ మూవీ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’లో నటిస్తున్న మంజిమ.. మూడేళ్ల క్రితం నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. -
ఇకపై అలా చేయను!
తమిళసినిమా: ఇకపై అలా చేస్తే అర్థం ఉండదు అంటోంది నటి తమన్నా. కథానాయకిగా పుష్కరకాలాన్ని దాటేసిన ఈ బ్యూటీ ఇప్పటికీ నటిగా తన స్థాయిని కాపాడుకుంటూనే వస్తోంది. కోలీవుడ్‌లో కలూరి, పడిక్కాదవన్, అయన్, పయ్యా, చిరుతై, వీరం, ధర్మదురై చిత్రాల నుంచి ఇటీవల విక్రమ్‌తో నటించిన స్కెచ్ చిత్రం వరకూ పలు సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంది . ఇక బాహుబలి చిత్రంలో విప్లవ యువతిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ప్రస్తుతం తమిళంలో కొత్త చిత్రం లేకపోయినా, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర తెలుగు రీమేక్‌లో నటిస్తున్న తమన్నా తన 12 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి తెలుపుతూ ఇంత కాలం కథానాయకిగా రాణించడం నిజంగా తన అదృష్టం అని పేర్కొంది. ఇప్పటి వరకూ పొందిన అనుభవాలను ఇకపై నటించనున్న చిత్రాలకు ఉపయోగిస్తాను అని అంది. మొదట్లో ఒకటి రెండు తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోరని కొత్త కదా! పోను పోను నేర్చుకుంటుందిలే అని భావిస్తారని పేర్కొంది. అయితే ఇకపై అలా కుదరదని, తనపై బాధ్యత పెరిగిందని చెప్పింది. ఇన్ని చిత్రాల్లో నటించి, ఇంత అనుభవం గడించిన తరువాత సాధారణ పాత్రల్లో నటిస్తే అర్థం ఉందని అంది. అందుకే నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలనే అంగీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అవి కమర్శియల్ పరంగానూ విజయం సాధించాలని పేర్కొంది. అలాంటి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తానని చెప్పింది. కొత్త తారలు మోడ్రన్ డ్రస్ ధరించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని, అయితే ఎంత కొత్త దుస్తులు అయినా ధరించడానికి సౌకర్యంగా ఉన్నాయా అన్నది ముఖ్యం అని అంది. ఎలాంటి దుస్తులు ధరించినా, అవి మన శరీరాకృతికి నప్పేలా ఉన్నాయా? అన్నది కూడా గమనించాలని చెప్పింది. సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తమన్నా పేర్కొంది. -
తొక్కేసిందిగా!
కుడి వైపు తొక్కారు కాజల్ అగర్వాల్. ఎడమవైపు బ్యాలెన్స్ తప్పింది. వెంటనే ఎడమవైపు తొక్కారు. ఈసారి బ్యాలెన్స్ తప్పలేదు. కుడి, ఎడమలు కుదిరాయి. అంతే.. తొక్కేశారు. హలో గురూ.. కాజల్ ఎవర్నో తొక్కేసింది అనుకునేరు. తొక్కింది సైకిల్ని బాస్. బాలీవుడ్లో కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ సినిమాను సౌత్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకరినే హీరోయిన్గా అనుకున్నప్పటికీ ఫైనల్‌గా ఒక్కో లాంగ్వేజ్‌లో, ఒక్కో హీరోయిన్ సెట్ అయ్యారు. తమిళ క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో నటించేందుకు ఫ్రాన్స్ వీధుల్లో కాజల్ సైకిల్ సవారీ చేశారు. -
సీతాకోక చిలుక షాపింగ్ చేసింది!
‘బటర్ ఫ్లై’ అంటే ఏంటి? సీతాకోక చిలుక! ఎక్కడైనా సీతాకోక చిలుక గాల్లో ఎగురుతుంది కానీ... షాపింగ్ చేస్తుందా? చేయదు. మరి, చేసిందని చెబుతారేంటి? అనుకుంటున్నారా? ఇప్పుడు కన్నడలో ‘బటర్ ఫ్లై’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. హిందీ హిట్ ‘క్వీన్’కి రీమేక్ ఇది. హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను కన్నడలో పరుల్ యాదవ్ చేస్తున్నారు. అంటే... ఆమె సీతాకోక చిలుకే కదా! ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. చిత్రీకరణ మధ్యలో ఓ రోజు సెలవు ఇవ్వడంతో షాపింగ్ చేశానని పరుల్ తెలిపారు. ఇంతకీ, ఫ్రాన్స్‌లో షాపింగ్ ఎక్కడ చేశారో తెలుసా? తమన్నా సైట్ సీయింగ్‌కి వెళ్లారు కదా? మొనాకో... అక్కడే! షాపింగ్‌తో పాటు చుట్టుపక్కల అందమైన ప్రదేశాలు కూడా తిరిగొచ్చారట! అంతే కాదండోయ్... శనివారం పరుల్ అమ్మగారి బర్త్‌డే. ఆ సెలబ్రేషన్స్‌లోనూ ఫుల్లుగా సందడి చేశారు. ‘‘నా స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఇన్స్పిరేషన్ మా అమ్మే’’ అని పరుల్ సోషల్ మీడియా ద్వారా తెలియ చేశారు. -
ప్యారిస్‌లో నలుగురు అందగత్తెలు..!
ప్యారిస్‌లో మన బ్యూటీస్ సందడి చేస్తున్నారు. వేర్వేరు భాషల్లో రూపొందుతున్న ఒకే చిత్రం రీమేక్‌లో నటిస్తున్న ఈ నలుగురు సౌందర్యరాశులు ఎవరా అంటే? మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. సాధారణంగా ఒక చిత్రం నాలుగు భాషల్లో ఏకకాలంలో రీమేక్ అవడం అన్నది అరుదు. ఆ నాలుగు భాషల్లోనూ షూటింగ్ ఒకేసారి ఒకేచోట జరగడం మరింత విశేషమే. హిందీలో కంగనా రనౌత్ నటించి జాతీయ అవార్డును అందుకున్న 'క్వీన్' చిత్రం ఇప్పుడు తాజాగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో ఏక కాలంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కంగనా పాత్ర తమిళంలో కాజల్ అగర్వాల్, తెలుగులో తమన్నా, కన్నడంలో ఫరూల్ యాదవ్, మలయాళంలో మంజిమామోహన్ చేస్తున్నారు. తమిళ, కన్నడ భాషా చిత్రాలకు నటుడు రమేష్ అరవింద్, తెలుగు చిత్రానికి నీలకంఠ, మలయాళంలో డిజో జోస్ అంటోని దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దర్శకులు వేరైనా, కథానాయికలు వేరైనా చిత్రీకరణ మాత్రం షాట్ ఒన్, టేక్స్ ఫోర్ అంటూ ఏకకాలంలో, ఒకేచోట జరుపుకుంటున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మలు షూటింగ్లో భాగంగా ఇప్పుడు ప్యారిస్‌లో మకాం పెట్టారు. -
క్వీన్ రీమేక్‌లో కొత్త ట్విస్ట్
బాలీవుడ్లో ఘనవిజయం సాదించిన క్వీన్ సినిమాను సౌత్ లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో మార్పులు చేర్పులు తరువాత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే కన్నడ వర్షన్ షూటింగ్ పూర్తికావస్తుండగా తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ప్రారంభం కానుంది. అంతా ఓకే అనుకుంటున్నసమయంలో ఈ టీంకు మరో షాక్ తగిలింది. హిందీలో లిసా హెడెన్ నటించిన పాత్రకు తెలుగు తమిళ భాషల్లో అమీజాక్సన్‌ను తీసుకున్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్ సమయంలో అమీకి ఓ ఇంగ్లీష్ వెబ్ సీరీస్ లో ఆఫర్ రావటంతో క్వీన్ రీమేక్ నుంచి తప్పుకుంది. దీంతో చిత్రయూనిట్ ఆ పాత్రకు మరో నటిని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ ‘క్వీన్’ పేరుతోనే తెరకెక్కుతున్న తెలుగు రీమేక్‌లో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా ‘పారిస్ పారిస్’ పేరుతో తెరకెక్కుతున్న తమిళ రీమేక్‌లో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. -
టాలీవుడ్ 'క్వీన్'..!
చాలారోజులుగా ఊరిస్తున్న క్వీన్ తెలుగు రీమేక్ ప్రారంభమైంది. ఎంతో మంది హీరోయిన్ల పేర్ల చర్చకు వచ్చిన ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేశారు. షో, మిస్సమ్మ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ క్వీన్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు వర్షన్ కు కూడా క్వీన్ అనే టైటిల్ నే నిర్ణయించారు. ఇప్పటికే 'బటర్ ఫ్లై' పేరుతో తెరకెక్కుతున్న కన్నడ క్వీన్ షూటింగ్ పూర్తి కాగా, కాజల్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' ఇటీవలే ప్రారంభమైంది. ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో క్వీన్ తెలుగు రీమేక్ షూటింగ్ ప్రారంభించనున్నారు. మనుకుమరన్ నిర్మిస్తున్న ఈసినిమాను రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. On the way to launch #Queen #Queenonceagain Telugu @mediente pic.twitter.com/hbMuoUSQgA — Tamannaah Bhatia (@tamannaahspeaks) 1 October 2017 -
నాలుగు భాషల్లో నలుగురు రాణులు..!
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ ను సౌత్ లో రీమేక్ చేయటం పై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో కంగనా రనౌత్ నటించిన పాత్రలో సౌత్ లో ఎవరి నటిస్తారన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించాలని భావించినా.. అది సాధ్యపడలేదు. దీంతో ఒక్కో భాషల్లో ఒక్కో హీరోయిన్ క్వీన్ పాత్రలో అలరించనుంది. ఇప్పటికే కన్నడ క్వీన్ షూటింగ్ పూర్తి కావచ్చింది. బటర్ ఫ్లై పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో పరుల్ యాదవ్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ వర్షన్ కు దర్శకత్వం వహిస్తున్న రమేష్ అరవింద్ తమిళంలోనే ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పారిస్ పారిస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ క్వీన్ గా నటించనుంది. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా తెలుగు, మలయాళ భాషల విషయంలో కూడా క్లారిటీ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు వర్షన్ లో క్వీన్ గా తమన్నా నటించనుందట. ఈ సినిమాను జాతీయ అవార్డు దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేయనున్నాడు. జామ్ జామ్ పేరుతో తెరకెక్కుతున్న మలయాళ వర్షన్ లో సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఫేం మంజిమా మోహన్ క్వీన్ పాత్రలో నటించనుంది. అయితే మలయాళ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. -
షో డైరెక్టర్‌తో క్వీన్..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు కేవలం కన్నడ రీమేక్ మాత్రమే మొదలైంది. తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా క్వీన్ రీమేక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. షో, మిస్సమ్మ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడట. తమన్నా లేదా కాజల్ లలో ఒకరు లీడ్ రోల్ లో నటించే అవకాశం ఉంది. అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తారా..? లేక కేవలం తెలుగు వర్షన్ మాత్రమే రూపొందిస్తారన్న అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారన్న టాక్ వినిపిస్తోంది. -
రాణి జోలికి వెళ్లకూడదు!
కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రంలో కంగనా నటన చూసి, ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం కంగనాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంకా పలువురు సినిమా తారలు కంగనాని అభినందనలతో ముంచెత్తారు. ఆ జాబితాలో సమంత కూడా ఉన్నారు. ‘క్వీన్’ సినిమా చూశానని, బాగా నచ్చిందని, కంగనా నటన అద్భుతం అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు సమంత. దాంతో ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో అవకాశం వస్తే, సమంత కచ్చితంగా చేస్తారని ఎవరికి వారు ఊహించుకున్నారు. ఆ ఊహ నిజం కాదని సమంత ట్వీట్ తెలియజేసింది. ఆదివారం సాయంత్రం అభిమానులతో ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా తన మనోభావాలను పంచుకున్నారు సమంత. ఓ అభిమాని ‘క్వీన్’ సినిమాలో అవకాశం వస్తే చేస్తారా? అని అడిగితే - ‘‘ఈ సినిమాని రీమేక్ చేస్తే న్యాయం జరగదని నా ఫీలింగ్. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్సవుతుందనుకుంటున్నా. అందుకే ‘క్వీన్’ జోలికి వెళ్లకూడదు’’ అని పేర్కొన్నారు సమంత.