రాణి జోలికి వెళ్లకూడదు! | Samantha not acting in Queen remake | Sakshi
Sakshi News home page

రాణి జోలికి వెళ్లకూడదు!

Published Sun, Apr 6 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

రాణి జోలికి వెళ్లకూడదు!

రాణి జోలికి వెళ్లకూడదు!

కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రంలో కంగనా నటన చూసి, ప్రేక్షకులు మంత్ర ముగ్ధులవుతున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం కంగనాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంకా పలువురు సినిమా తారలు కంగనాని అభినందనలతో ముంచెత్తారు. ఆ జాబితాలో సమంత కూడా ఉన్నారు. ‘క్వీన్’ సినిమా చూశానని, బాగా నచ్చిందని, కంగనా నటన అద్భుతం అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు సమంత. దాంతో ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో అవకాశం వస్తే, సమంత కచ్చితంగా చేస్తారని ఎవరికి వారు ఊహించుకున్నారు. ఆ ఊహ నిజం కాదని సమంత ట్వీట్ తెలియజేసింది. ఆదివారం సాయంత్రం అభిమానులతో ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా తన మనోభావాలను పంచుకున్నారు సమంత. ఓ అభిమాని ‘క్వీన్’ సినిమాలో అవకాశం వస్తే చేస్తారా? అని అడిగితే - ‘‘ఈ సినిమాని రీమేక్ చేస్తే న్యాయం జరగదని నా ఫీలింగ్. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్సవుతుందనుకుంటున్నా. అందుకే ‘క్వీన్’ జోలికి వెళ్లకూడదు’’ అని పేర్కొన్నారు సమంత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement