షూటింగ్ పూర్తిచేసుకున్న ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ | Tamanna That Is Mahalakshmi Movie Shooting completed | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 27 2018 4:30 PM | Last Updated on Fri, Jul 27 2018 4:55 PM

Tamanna That Is Mahalakshmi Movie Shooting completed - Sakshi

మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్‌ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై మిల్క్‌బ్యూటీ తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘దట్ ఈజ్ మాహాలక్ష్మీ’. బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాకి ఇది రిమేక్. కాగా తాజాగా జరిగిన యూరప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో  సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు మరియు మాస్టర్ సంపత్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం సన్నాహకాలు చేస్తుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్న తరువాత యూనిట్‌ సభ్యులతో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారు. తరవుత ‘అ’ ఫేం ప్రశాంత​ వర్మ ఈ ప్రస్టీజియస్‌ రీమేక్‌ను పూర్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement