క్వీన్‌ రీమేక్‌లో కొత్త ట్విస్ట్‌ | Amy Jackson backs out of Queen remake | Sakshi
Sakshi News home page

క్వీన్‌ రీమేక్‌లో కొత్త ట్విస్ట్‌

Published Wed, Nov 1 2017 4:10 PM | Last Updated on Wed, Nov 1 2017 4:10 PM

Amy Jackson backs out of Queen remake

బాలీవుడ్‌లో ఘనవిజయం సాదించిన క్వీన్‌ సినిమాను సౌత్‌ లో రీమేక్‌ చేసేందుకు చాలా ​కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో మార్పులు చేర్పులు తరువాత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే కన్నడ వర్షన్‌ షూటింగ్‌ పూర్తికావస్తుండగా తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ప్రారంభం కానుంది. అంతా ఓకే అనుకుంటున్నసమయంలో ఈ టీంకు మరో షాక్‌ తగిలింది.

హిందీలో లిసా హెడెన్‌ నటించిన పాత్రకు తెలుగు తమిళ భాషల్లో అమీజాక్సన్‌ను తీసుకున్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్‌ సమయంలో అమీకి ఓ ఇంగ్లీష్‌ వెబ్‌ సీరీస్‌ లో ఆఫర్‌ రావటంతో క్వీన్‌ రీమేక్‌ నుంచి తప్పుకుంది. దీంతో చిత్రయూనిట్‌ ఆ పాత్రకు మరో నటిని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ ‘క్వీన్‌’ పేరుతోనే తెరకెక్కుతున్న తెలుగు రీమేక్‌లో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా ‘పారిస్‌ పారిస్‌’ పేరుతో తెరకెక్కుతున్న తమిళ రీమేక్‌లో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement