
కాజల్ అగర్వాల్
అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకే పెళ్లి వద్దన్నాడు. చేసేదేం లేక ఒంటరిగా ప్యారిస్‌కు ప్రయాణమైంది పరమేశ్వరి. ఈ జర్నీలో తన అనుభవాలేంటి? తను నేర్చుకున్నదేంటి తెలియాలంటే ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రం చూడాల్సిందే అని కాజల్ అగర్వాల్ అంటున్నారు. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటుడు, దర్శకుడు రమేశ్ అరవింద్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు చిత్రాలను మీడెంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ నిర్మిస్తోంది. తమిళ వెర్షన్‌లో కాజల్ అగర్వాల్ పరమేశ్వరి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేశారు చిత్రబృందం. వచ్చే నెలలో ట్రైలర్‌ను, ఏడాది చివర్లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment