అశ్లీల సన్నివేశంపై నెటిజన్ల ఆగ్రహం | Paris Paris Movie Director React on Trailer Trolling | Sakshi
Sakshi News home page

కాజల్‌ నీకిది తగునా?

Published Sat, Dec 29 2018 11:46 AM | Last Updated on Sat, Dec 29 2018 12:14 PM

Paris Paris Movie Director React on Trailer Trolling - Sakshi

సినిమా: కాజల్‌ నీకిది తగునా అని నెటిజన్లతో పాటు పలువురు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఈ అమ్మడిపై మండిపడడానికి కారణం ఏమిటా అనేగా మీ ఆసక్తి. ఈ బ్యూటీ ఇంతకుముందు పలు చిత్రాల్లో గ్లామర్‌ పాత్రల్లో నటించినా, తనకుంటూ ఒక ఇమేజ్‌ను ప్రేక్షకుల్లో సంపాదించుకుంది. అలాంటిది ఇటీవల చేతిలో అవకాశాలు తగ్గుతున్నాయనుకుందో పాత్ర డిమాండ్‌ చేసిందో గానీ, ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రంలో ఒక సన్నివేశంలో చాలా అశ్లీలంగా నటించింది. ఈ బ్యూటీ ఇన్నేళ్లలో హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ఇదే. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్‌ చిత్ర తమిళ రీమేక్‌లో కాజల్‌అగర్వాల్‌ నటిస్తోంది. ఇదే చిత్రం తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే.


తెలుగులో నటి తమన్నా నటిస్తోంది. కాగా రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న తమిళ వర్షన్‌ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్ర ట్రైలర్‌ మిశ్రమ స్పందననే పొందింది. పైగా ఇందులో కాజల్‌ నటించిన ఒక అశ్లీల సన్నివేశంపై ప్రేక్షకులు, నెటిజన్లు మండిపడుతున్నారు. కాజల్‌ ఇప్పుడిలాంటి సన్నివేశాల్లో నటించడం నీకవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయంపై కాజల్‌అగర్వాల్‌ స్పందించలేదుగానీ, దర్శకుడు రమేశ్‌ అరవింద్‌ మాత్రం ఆ సన్నివేశాన్ని సమర్థించుకున్నారు. ఆయన స్పందిస్తూ చిత్ర ట్రైలర్‌ మాత్రమే చూడడంతో మీకలా అనిపిస్తుంది గానీ, అంతకుముందు, ఆ తరువాత వచ్చే సన్నివేశాలతో కలిపి చూస్తే అందుకు కారణం తెలుస్తుందని అన్నారు. అలాంటి సన్నివేశం హిందీ చిత్రంలోనూ ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందీలో ఈ పాత్రను పోషించిన కంగనా రనౌత్‌ జాతీయ అవార్డును గెలుచుకున్నారన్నది గమనార్హం. కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం నటుడు కమలహాసన్‌తో కలిసి ఇండియన్‌–2లో నటించడానికి తయారవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement